🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*
. *భాగం - 2*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*
. *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*
*🌹శంఖరబట్టు మొదటి*
*మజిలీ🌹*
🌹🌹🌹🌹
అంబ అనుగ్రహం తో శంఖరబట్టు ప్రయాణం సాగించుచూ మరుత్వమలై అను గ్రామము చేరుకున్నారు.
హానుంతులవారు సంజీవిని పర్వతమును తీసుకొని పోవుచుండగా చిన్న ముక్క జారిన దనియు అదియే ఈ మరుత్వమనే పర్వతమని తెలుసుకున్నారు.ఆ పర్వతం చాలా అందంగా చూడచక్కని గుహలు తో నిండి వున్నది.అలా ఆ గుహలు పరికించగా ఒక గుహ ముందు పెద్దపులి నిలబడి యున్నది.దానిని చూసి శంఖరబట్టుకు
పై ప్రాణములు పైనేపోయి శ్రీ పాదుల వారి నామస్మరణ చేసుకుంటూ గట్టిగా పైకి అరిచేడు. ఆ పెద్దపులి శాంతంగా నిశ్చలంగా వున్నది. అదే గుహనుండి ఒక మహతపస్వి బయటకువచ్చెను.
అంతట ఆ వృధ్ధ తపస్వి దీవించి శ్రీపాదులవారు కరుణాకటాక్షాలు వుండబట్టే శంఖరబట్టు ఈ సిద్ద,తపో భూమికి రాగలిగేడని ఆ తపస్వి శంఖరబట్టు రాకకోసమే నిరీక్షింస్తున్నట్లు చెప్పి శ్రీ పాదవల్లబుని దర్శనము త్వరగా చేసుకోమ్మని ఆ మహపురుషుని చరిత్ర వ్రాయమని చెప్పి అక్కడ వున్న పెద్దపులి మహా జ్ఞాని అని నమస్కరించుకోమని చెప్పేరు.సిద్దపురుషుడు చెప్పిన ప్రకారము ఆ పులికి నమస్కరించ గానే ఆపులి ఓంకారం చేసి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించి ఒక కాంతి ఏర్పడి కాంతిలో మహాపురుషుని గా అదృశ్యమయ్యేరు.
ఆ వృద్ద తపస్వి ఆదేశం మేరకు శంఖరభట్టు గృహలో ప్రవేశించి ఆయన చేసిన హోమాది పూజలు గాంచినాడు. ఆ వృధ్ధ తపస్వి మరలా ఆశ్వీరదించి శంఖరబట్టు అడిగిన మీదట ఆపులి యొక్క పుట్టు పూర్వోత్తరాలు చెప్పనారాబించేరు.
రేపు మరిన్ని విషయాలతో
జై గురుదేవదత్తా🙏
*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి