🕉 మన గుడి :
⚜ కడప జిల్లా : పొలతల
⚜ శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం
💠 పొలతలగా ప్రసిద్ధి చెందిన మహిమాన్వతమైన ఆలయంగా !
సీతమ్మరాకను అన్వేషిస్తు రామలక్ష్మణులు వచ్చి పూజలు నిర్వహించిన క్షేత్రంగా !
సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమశివుని స్మరిస్తున్న క్షేత్రంగా !
నూటొక్క కోనేర్లు గల ఏకైక ఆలయంగా శేషాచల దట్టమైన పర్వతశ్రేణుల్లో పచ్చని చెట్లు, సేలయేళ్ల మధ్య ఈ పొలతల క్షేత్రం వెలసింది.
💠 ఈ క్షేత్రంలో మల్లేశ్వరస్వామి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, అక్కదేవతలు, బండెన్నస్వామి ఆలయాలు ఉన్నాయి.
⚜ ఆలయ చరిత్ర ⚜
💠 పూర్వం లోకకళ్యాణార్థం శివపార్వతులు సంచరిస్తు పొలతల క్షేత్రానికి రాగా అచ్చట ఆహ్లాదకరమైన వాతావరణం, సుగంధభరితమైన సువాసనలు వెదజల్లుతూ వుండేవని, వీటిని ఆస్వాదించేందుకు శివపార్వతులు అచ్చట పాదాలు వుంచినా లోపలికి దిగబడుచుండెను.
ప్రస్తుత దేవాలయం వున్నచోట అడుగుపెట్టగా ఓంకార నామంతో శబ్ధం వెలువడి ఆయన పాదములకు గట్టి శిలలు స్పర్శించగా ఆ స్థలం తమకు అనుకూలంగా వుందని శివపార్వతులు నిశ్చయించుకున్నారని, ఆ క్షేత్రాన్ని పులి తలలాగా ప్రదేశం గట్టిగా వుండడంతో పులి తలగా ప్రసిద్ది చెందిందని కాలక్రమేణా పులితలగా రూపాంతరం చెంది నేడు పొలతలుగా మారింది.
💠 ఈ క్షేత్రంలో సీతమ్మరాకను అన్వేషిస్తు ఇచ్చట రామలక్ష్మణులు కొలనులో స్నానం చేసి శివుని దర్శించి పునీతులైనారని పురాణాలు చెప్తున్నాయి.
తర్వాత పాండవులు వనవాస కాలంలో అర్జునుడు కందమూలములతో, మల్లెపూలతోను పూజించినందున మల్లికార్జును ప్రసిద్ధి పొందారని పురాణాలు చెబుతున్నాయి.
💠 దాదాపు 800 సంవత్సరాల క్రితం పొలతల గ్రామం దాన్ని చుట్టుపక్కల ఏడు చిన్న ఊర్లు వుండేవని, ప్రజల జీవనం పంటసిరి, పాడిసిరితో సాగేదని పెద్దలు చెబుతుంటారు. ఈ ఊర్లకు చెందిన ఆవుల మందను కాసే ధార్మిక మానవుడు రామయ్య. ఆయనకు ఒక శిష్యుడు. ఆయన పేరు పిలకత్తు.
తాము కాసే ఆవుల మందలో ఒక ఆవు శూలుకట్టడం కానీ, ఈనడం కానీ లేకుండా చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆ విషయం గుర్తించి దాని రాక పోకలపై దృష్టి పెట్టాడు పిలకత్తు.
🔅 అక్కదేవతలు 🔅
💠 పూర్వం ఈ ప్రాంతం సమీపంలో భూతప్రేత విశాచాలు సంచరిస్తూ ప్రజలను భయపెడుతుండేవని, జనకమహర్షి ఆ బాధల నుండి తమను రక్షించాలని అక్కడి భక్తులు కోరగా ఆయన శివున్ని ప్రార్థించాడని, శివుడు తన జటాజుటం నుండి ఏడుగురు అక్కదేవతలను ఉద్భవింపచేశారు.
💠 మొదటగా సూర్యకన్య, చంద్రకన్య, అగ్నికన్య, పెద్దవీరమల్లమ్మ, మంత్రాల మహేశ్వరి, నానమునెమ్మ, చిన్నవీరమల్లమ్మ, వీరబండెన్నస్వాములు ప్రత్యక్షమయ్యారు. వీరిని భూతప్రేత పిశాచాలు పీడించేవారి నుండి ప్రజలను కాపాడేందుకు తూర్పుభాగాన సాంబశివుని మధ్యభాగంలో అక్కదేవతలు బొచ్చికోనలో బండెన్నస్వామి ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నారని భక్తుల విశ్వాసం.
💠 మహాశివరాత్రి సందర్భంగా భూతప్రేతలు పట్టిన మహిళలు ఈ క్షేత్రాన్ని దర్శించితే భూతప్రేతలు పారిపోతాయని భక్తుల నమ్మకం. బండెన్నను ఓ కన్య మోహించగా ఆయన ఆగ్రహించి ఆమెను భస్మం చేసినట్లు పురాణగాధలు చెబుతున్నాయి. అప్పటి నుండి బండెన్నస్వామిని స్త్రీలు దర్శించడం నిషిద్ధంగా మారింది. ఇవి శైవక్షేత్రమైనప్పటికీ బండెన్న స్వామి వద్ద కోళ్లు, మేకలు ఇవ్వడం విశేషం.
💠 మొదటిపూజ అక్కదేవతలైన కన్నేలకు, పిమ్మట తనకు ఆ తరువాత పులిబండెన్నకు పూజలు జరుగుతాయని చెప్పి పరమశివుడు వరం ఇచ్చాడు.
అదేవిధంగా నేడు కూడా తొలి పూజలు అక్కదేవతలకు జరుగుతున్నాయి.
💠 పొలతల ప్రాంత ప్రజలు తరచు దివిటి దొంగల బారిన పడేవారు. దివిటీ దొంగలు సర్వం దోచుకుని వెళ్లేవారు. అంతేగాక కలరా వ్యాధితో చాలామంది మృత్యువాత పడ్డారు.
ఈ కారణాలతో పొలతల ప్రాంతంలోని ప్రజలు గ్రామాలు వదలిపెట్టి వెళ్లడం ప్రారంభించారు.
దీంతో చాలాకాలం మల్లికార్జున స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి.
💠 ఇదిలా వుండగా కాక వేంపల్లె తూర్పున గండి కొట్టేందుకు లో ఆంజనేయ క్షేత్రం ఉంది.
ఆ క్షేత్రానికి 3 మైళ్ల దూరంలో ఏక దంతనాయుడు కోట ఉండేది. ఆ కోటలో దొంగతనాలు చేసి జీవించే 50 కుటుంబాల వారు జీవించేవారు. వీరు పరాక్రమవంతులు. వీరిని ఏకల వీరులు అని కూడా పిలిచేవారు.
💠 ఇక్కడికి వచ్చే స్త్రీ , పురుషులు తమ కోర్కెలు తీరాలని ముడుపులు కడుతుంటారు. ఇక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టినా ఇక్కడే వదలిపెట్టి వచ్చే సంప్రదాయం ఉంది.
💠 మహాశివరాత్రి, కార్తీకమాస, వారోత్సవాలకు జిల్లా నుంచే కాక ఇతర రాష్టాల్ర నుంచి వేలాది వాహనాల్లో భారీగా భక్తులు తరలివస్తారు.
ప్రతి సోమవారం జిల్లాతోపాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పొలతల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
💠 ప్రతి రోజు ఉదయం స్వామివారికి గణపతి పూజ, మహాన్యాస రుద్రాభిషేకం, మహామంగళ హారతి, అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తురు.
💠 భక్తులు కోనేర్లలో స్నానాలాచరించి మల్లేశ్వరస్వామిని, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యంస్వామి, అక్కదేవతలు, బండెన్నస్వామిని దర్శించుకుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి