12, జూన్ 2023, సోమవారం

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత!*

 అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత!* 

                ➖➖➖✍️


*“ఓమ్ నమో నారాయణాయ”* 


*అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని,*

 *“నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.*


*అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది.*


*ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.*


*జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. *


*ఇంకా,*

*“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే*

*“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే*

*“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే*

*“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే*


*“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.*


 *“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి.*


*“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.*


*“ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.*


*ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఓమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించటంచేత ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు.*


*ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.*


*ధ్యాయేన్నారాయణందేవం*

*స్నానాదిఘ చ కర్మసు,*

*ప్రాయశ్చిత్తం హి సర్వస్వ*

*దుష్కృత స్వేతివైశ్రుతిః!*


*స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.*


*ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః*

*ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!*


*సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.*


*ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం*

*మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని*

*తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద*

*ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః*


*‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది.*


*ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).*


*శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం                   కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,                             హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్.                        తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్*


*‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు.*✍️

🙏“ఓమ్ నమో నారాయణాయ”🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



కామెంట్‌లు లేవు: