🕉 *మన గుడి : నెం 440*
⚜ *ఉత్తర కర్ణాటక : ఇడగుంజి*
⚜ *శ్రీ
ఇడగుంజి గణపతి క్షేత్రం*
💠 ఇడగుంజి గణపతి క్షేత్రం
అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి.
ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు,
ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర సమీపంలోని
ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత
శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు.
💠 స్కందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. 'ఎడ' అంటే 'ఎడమవైపు' మరియు 'కుంజ్' అంటే తోట. శరావతి నది ఎడమ ఒడ్డున ఉన్నందున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది అరేబియా సముద్రంలో కలిసేచోట ఈ ఆలయం ఉంది.
💠 ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.
ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.
💠 కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు,
పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు
ఈ ఆలయానికి చేరుకుంటారు.
అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత రెండు చీటీలను ఉంచుతారు.
కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే
దానిని శుభసూచకంగా భావించి_ వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు.
అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు
💠 ఇడగుంజి ఆలయంలో మూలవిరాట్టైన
వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు.
సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు.
ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.
💠 ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి.
అంతే కాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకుని ఉంటుంది.
కానీ, ఇక్కడ ఉండదు.
అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉండటం
పలు విగ్రహాలకు గమనించి ఉంటాము.
అలాగే ఇచట గణపతి ద్విభజాలతో ఉంటారు.
రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనబడుతాడు.
ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే.
💠 పురాణ కథనం ప్రకారం మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి.
అంటే.. ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట.
💠 భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినపుడు అక్కడ ఉండేవాడని చెపుతారు.
ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకొనేవారు.
🔆 *స్థలపురాణం* 🔆
💠 ద్వాపర యుగం ముగిసే సమయానికి కృష్ణుడు భూమిని విడిచిపెట్టబోతున్నాడు కాబట్టి అందరూ కలియుగ ఆగమనాన్ని భయపడ్డారు .
కలియుగం యొక్క అన్ని అడ్డంకులను అధిగమించడానికి కృష్ణుడి సహాయం కోరుతూ ఋషులు తపస్సులు మరియు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు.
💠 వాలఖిల్య నేతృత్వంలోని ఋషులు కర్నాటకలోని శరావతి నది ఒడ్డున అరేబియా సముద్రంలో కలుస్తున్న అటవీ ప్రాంతమైన కుంజవనంలో క్రతువులు ప్రారంభించారు.
ఈ సమయంలో, అతను యాగం చేయడంలో చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాడు.
అందువల్ల, అతను సమస్యను పరిష్కరించడానికి తగిన మార్గాలను అన్వేషిస్తూ నారదుని సలహా కోరాడు .
💠 నారదుడు వాలఖిల్యకు తన యాగాన్ని పునఃప్రారంభించే ముందు అడ్డంకులను తొలగించే గణేశుని ఆశీర్వాదం పొందమని సలహా ఇచ్చాడు.
ఋషుల అభ్యర్థన మేరకు, నారదుడు వినాయకుని జోక్యాన్ని కోరుతూ కుంజవన వద్ద శరావతి నది ఒడ్డున వ్రతం కోసం ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు.
భూమిని నాశనం చేయడంలో పాల్గొన్న రాక్షసులను అంతం చేయడానికి త్రిమూర్తులు ( బ్రహ్మ , విష్ణు, శివుడు ) కూడా ఈ స్థలాన్ని గతంలో సందర్శించారు.
💠 దేవతలు ఆ సమయంలో చక్రతీర్థం మరియు బ్రహ్మతీర్థం అనే పవిత్ర సరస్సులను కూడా సృష్టించారు.
నారదుడు మరియు ఇతర ఋషులు దేవతీర్థం అనే కొత్త పవిత్ర చెరువును సృష్టించారు. నారదుడు దేవతలను ఆహ్వానించి వినాయకుని తల్లి పార్వతిని గణేశుడిని పంపమని వేడుకున్నాడు. పూజలు నిర్వహించి గణేశుడిని కీర్తిస్తూ కీర్తనలు పఠించారు.
వారి భక్తికి సంతోషించిన గణేశుడు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆచారాలను నిర్వహించడంలో సహాయపడటానికి స్థలంలో ఉండటానికి అంగీకరించాడు.
💠 ఈ సందర్భంగా, ఆలయానికి నీటిని తీసుకురావడానికి మరో సరస్సు కూడా సృష్టించబడింది మరియు దానికి గణేశ-తీర్థం అని పేరు పెట్టారు. అదే ప్రదేశాన్ని ఇప్పుడు ఇడగుంజి అని పిలుస్తారు.
💠 మురుడేశ్వర (19km), గోకర్ణ (68km),
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి