15, సెప్టెంబర్ 2024, ఆదివారం

వామన జయంతి

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

15.09.2024,ఆదివారం


*నేడు వామన జయంతి, (ఓనం)*


కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి, తమిళనాట దీపావళి ఎంత ప్రసిద్ధో.. ఓనం కూడా కేరళ సంస్కృతికి ప్రతీక. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓన‌ం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ.


ఓనం వేడుకల్లో భాగంగా తొలిరోజును అతమ్.. చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు.


పదవ రోజు తిరువోనం. దీనినే ఓనం ప్రధాన ఉత్సవంగా పరిగణించాలి. కుటుంబంలోని అందరు ఒకచోట చేరి కలసి పండగ జరుపుకుంటారు. *‘ఓనమ్ సద్య’* అనే ప్రత్యేక భోజనాన్నిఈ రోజున ఆరగిస్తారు, అందరికీ పెడతారు. ఈ పండుగలో పూలతో అలంకరణ, వంటకాలు, ఆటలు, సంగీతం, కేరళ ప్రత్యేక సంప్రదాయ సంబరాలు భాగంగా ఉంటాయి.


ఓన సద్యం..


ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు.


పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే పండుగే ఓనం. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు.

కామెంట్‌లు లేవు: