ఉపవాసం రకాలు - సంపూర్ణ వివరణ - 3 .
అంతకు ముందు పెట్టిన రెండు పోస్టుల యందు ఉపవాసం రకాలు చేయు విధానం గురించి వివరించాను. ఇప్పుడు మీకు రసోపవాసం మరియు ఫలోపవాసం చేయు విధానం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తాను .
రసోపవాసం - తీసుకోవలసిన జాగ్రత్తలు .
ఉబ్బసవ్యాధులు కలిగినవారు మొదట నిమ్మరసం తాగుటకు భయపడుతుంటారు. కాని ఉపవాసంలో నిమ్మరసం త్రాగినట్లైనా ఆయాసం పెరగదు సరికదా తగ్గును. అవసరం అయినచో వేడినీటిలో నిమ్మకాయ పిండుకుని ఉదయం , సాయంత్రం వేడివేడిగా తాగవచ్చు . మధ్యహ్నం మాత్రం చన్నీటిలో తాగవలెను .
ప్రేవులలో పుండు , పొట్టలో పుండు , అమీబియాసిస్ వ్యాధితో బాధపడేవారు నిమ్మరసంతో ఉపవాసం చేయరాదు . వీరు పలుచటి మజ్జిగతోగాని ఉపవాసం చేయవలెను . రోగి చిక్కి బలహీనంగా ఉన్నచో పలచని పాలతో కూడా ఉపవాసం చేయవచ్చు .
మూత్రపిండ వ్యాధులలో బార్లినీటితో కాని , పచ్చికొబ్బరి నీటితోగాని ఉపవాసం చేయించవచ్చు. దీనివలన మూత్రం చక్కగా విసర్జించబడి మూత్రకోశ వ్యాధులు త్వరగా నయం అగును.
నిమ్మకాయలు దొరకని సమయంలో ఆయా ఋతువుల్లో లభించే బత్తాయి , కమల , నారింజ రసములను పలుచగా చేసి రోజుకు 3 సార్లు ఇవ్వవచ్చు .
ఫలోపవాసం చేయు విధానం -
ఉదయం 8 గంటలకు నిమ్మరసం , 10 గంటలకు రసముగల పండ్లు , మధ్యహ్నం 3 గంటలకు నిమ్మరసం మరియు సాయంత్రం 6 గంటలకు పండ్లు తీసుకోవాలి . ఈ విధముగా ఫలోపవాసం చేయవలెను . పండ్లే కదా అని అధికంగా తినరాదు. ఫలోపవాసము నందు మంచినీరు కూడా బాగా తాగినచో మలబహిష్కరణ మంచిగా జరుగును.
పైన చెప్పిన విధముగా ఉపవాసము సరైన నియమాలు పాటిస్తూ చేసినచో శరీరం నందలి వ్యర్ధపదార్ధాలు అన్నియు బయటకి వెడలి శరీరముకు మంచి ఆరోగ్యం చేకూరును. ప్రతి ఒక్కరు ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలు తీసుకుని శరీరాన్ని శుభ్రపరచుకొనవలెను. సర్వరోగాలకు మూలకారణం మనం తీసుకునే ఆహారం కావున మన శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొనవలెను .
సంపూర్ణం
మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి