15, సెప్టెంబర్ 2024, ఆదివారం

హైందవం వర్ధిల్లాలి

 *హైందవం వర్ధిల్లాలి*


భారతీయ సంస్కృతికి మూలాధారమైన హిందూ సంస్కృతి అంతరిస్తుందని అనను, అనలేను గాని, తగ్గుచున్నదన్న భావన కలుగుతుందని మాత్రము చెప్పగలను. 


ఉదారము, నిర్మలమైన హిందూ *వైదిక ధర్మమును*  జాతి జనులెల్లరు మనసా, వాచా, కర్మణా అనుసరించకపోవడం వల్లనే జాతి దుర్భలమై, సంఘటిత శక్తి కొరవడి ఇబ్బందులకు గురవుతున్నది.  *వైదిక ధర్మమంటే.... వేద ప్రొక్త ధర్మమే వైదిక ధర్మము*. అదే సనాతన ధర్మం.


*ఇతర మతముల, ధర్మముల ఆవిర్భానికి ముందే వైదిక ధర్మము లోకమంతటికీ మేలు చేసే మార్గం ఉపదేశించిందన్న  సత్యం విశ్వ వ్యాప్తం*.


 ఇతర మత గ్రంథాలన్ని వేదముల అనంతరమే వెలుగు చూసాయి. ఇది చారిత్రక సత్యము. జనులందరు వేదముల యందు  భక్తి కల్గి, వేద విహితమైన మార్గాన్ని అనుసరించాలి. 


ఏ మతమైనా, ధర్మమైనా అనుష్ఠించడం వలననే సజీవంగా ఉంటాయన్న సత్యం మరువరాదు. కావున జనులెల్లరు (కుల, వర్గ రహితంగా) ప్రత్యేక శ్రద్ధతో హైందవ సంప్రదాయ అనుష్టాన పరులు కావాలి. పెద్దలు  బోధించిన, పొందుపర్చిన ధర్మాలు ఆచరిస్తూ ఉండాలి. 


భారత దేశంలో రాష్ట్రాలు, భాషలు వేరైనా, సంస్కృతులు, సంప్రదాయాలు విభిన్నమైనా  దేశమంతా సమైక్యంగా ఉండాలంటే నిర్దేశించబడిన హిందూ జీవన విధానాన్ని హిందువులందరు అనుసరించాలి. హిందూ జీవన ప్రమాణాలలో ముఖ్యమైనవి.... *సత్సంస్కారం, నైతికత, సత్ప్రవర్తన, సత్యవాక్య పరిపాలన, శౌచాది ధార్మిక నిష్ఠ*  మున్నగునవి.


ఈ అధునాతన కాలంలో  *పాశ్చాత్య పోకడల ప్రభావాలకు లోనై అధికులు శాస్త్ర నిషిద్దమైన మార్గాలను అనుసరించి, పాపాలను మూట కట్టుకోవడమే గాకుండా, హిందూ మత వ్యతిరేక  ధర్మాలను బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇందువల్ల జాతి భ్రష్టు పట్టు అవకాశములు మెండు. ఇటువంటి చర్యల వలన మన భవిష్యత్ తరాలను మనమే తప్పుత్రోవ వైపు మళ్లిస్తునామన్న భావన కలుగుతుంది* కావున హిందూ  ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి.


ధన్యవాదములు.

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: