#సంభవామి_యుగే_యుగే
ముందుగా గణపతి పూజ చేయాలి. తరువాత కలశ పూజచేసిన పిదప యమునా పూజ ప్రారంభించాలి.
యమునా పూజ
ధ్యానం:
శ్లో: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే,
ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.
ఆవాహనం:
శ్లో: యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయిని,
ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.
యమునాదేవ్యై నమః ఆవాహయామి.
ఆసనం:
శ్లో:నమస్కరోమి యమునే సర్వపాపా ప్రణాశిని
రత్నసింహాసనం దేవే స్వీకురుష్వ మయార్పితం.
యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి.
పాద్యం:
శ్లో: సింహాసన సమారూడే దేవశక్తి సమన్వితే,
పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే.
యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం:
శ్లో: నందిపాడే నమస్తుభ్యం సర్వపాప నివారిణి,
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిదముత్తమం.
యమునాదేవ్యై నమఃఅర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయం:
శ్లో: హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే,
గృహాణాచమనీయం దేవి శంకరార్ధ షరీరిణి .
యమునాదేవ్యై నమఃఆచమనీయం సమర్పయామి.
స్నానం:
శ్లో: దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితేప్రియే
సర్వపాప ప్రశమని తున్గాభాద్రే నమోస్తుతే.
యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం:
శ్లో: గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే,
సువ్రతం కురుమే దేవి తుంగభద్రే నమోస్తుతే.
యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
మధుపర్కం:
శ్లో: కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే
మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే.
యమునాదేవ్యై నమఃమధుపర్కం సమర్పయామి.
ఆభరనాణి :
శ్లో: నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ షరీరిణి
సర్వలోకహితే తుభ్యం భీమరధ్యై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ఆభరనాణి సమర్పయామి.
గంధం:
శ్లో: కృష్ణ పాద సమద్భూతే గంగేత్రిపద గామిని,
జటాజూట సమదూతే సర్వకామఫలప్రదే.
యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి.
అక్షతలు:
శ్లో: గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని,
స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ నమలాన్ శుభాన్.
యమునాదేవ్యై నమఃఅక్షతాన్ సమర్పయామి.
పుష్పై పూజ:
శ్లో: మందారై పారిజాతైస్చ పాటలాశోక చంపకై
పూజయామి తవప్రీత్యై వందే భక్త వత్సలే .
యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి.
అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం సుజంఘాయ నమః - జంఘే పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పుణ్యాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలాయై నమః - కటిం పూజయామి
ఓం గోదావర్యై నమః - స్థనౌ పూజయామి
ఓం భవనాశిన్యై నమః - కంటం పూజయామి
ఓం తుంగ భద్రాయై నమః - ముఖం పూజయామి
ఓం సుందర్యై నమః - లలాటం పూజయామి
ఓం దేవ్యై నమః - నేత్రే పూజయామి
ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం భాగీరధ్యై నమః - శిరః పూజయామి
ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.
ధూపం:
శ్లో: దశాంగం గగ్గులోపెతం చందనాగరు సంయుతం
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతిగృహ్యాతాం.
యమునాదేవ్యై నమఃధూపం సమర్పయామి.
దీపం:
శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే.
యమునాదేవ్యై నమఃదీపం దర్శయామి.
నైవేద్యం:
శ్లో: భక్ష్యైస్చ భోజ్యైస్చ రాసి షడ్బిస్సమంవితం
నైవేద్యం గృహ్యాతాం దేవీ యమునాయై నమోనమః
యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం:
శ్లో: కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యాతాం దేవీ యమునాయై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారాన్ సమర్పయామి.
శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం
ధ్యానం:
శ్లో: క్రుత్వాదర్భ మాయం దేవం పరిధాన సమన్వితం
ఫనైసప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షినాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్య కారే
చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యా పద్య కారే
అవ్యయం సర్వలోకేశం పీతాంభరధరం హరిం
అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి
ఆవాహనం:
శ్లో: ఆగచ్చానంత దేవేశ తేజోరాశే జగత్పతే
ఇమాంమయాక్రుతం పూజాం గృహాణ సురసత్తమ.
అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సర్పయామి.
ఆసనం:
శ్లో: అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి.
తోరస్తాపనం:
శ్లో: తస్యాగ్రతో దృడం సూత్రం కుంకుమాక్తం సుదోరకం
చతుర్దశి గ్రంధి సంయుక్తం వుపకల్ప్య ప్రజాజాయే
అనంతపద్మనాభాయ నమఃతోరస్తాపనం కరిష్యామి.
అర్ఘ్యం:
శ్లో: అనంతగుణ రత్నాయ విశ్వరూప ధరాయ చ
అర్ఘ్యం దదామితెదేవ నాగాదిపతయే నమః
అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సర్పయామి.
పాద్యం:
శ్లో: సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన
పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి.
ఆచమనీయం:
శ్లో: దామోదర నమోస్తుతే నరకార్ణవతారక
గృహాణాచమనీయం దేవ మయాదత్తం హి కేశవా.
అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం:
శ్లో: అనంతానంత దేవేశ అనంత ఫలదాయక
దధి మద్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే
అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృతం:
శ్లో: అనంతగుణ గంభీర విశ్వరూప ధరానమ
పంచామ్రుతైస్చ విదివ త్స్నాపయామి దయానిధే.
అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం:
శ్లో: గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
స్నానం ప్రకల్పయేతీర్ధం సర్వపాప ప్రముక్తయే
అనంతపద్మనాభాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.
వస్త్ర యుగ్మం:
శ్లో: శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే
పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమఃవస్త్ర యుగమ సమర్పయామి.
యజ్ఞోపవీతం:
శ్లో: నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారాట్
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమఃయజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం:
శ్లో: శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాధీ భిరన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి.
అక్షతాన్:
శ్లో: శాలియాన్ తండులాన్ రంయాన్ మయాదత్తాన్ శుభావహాన్
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీ కురుశ్వా ప్రభో
అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి
పుష్పపూజ:
శ్లో: కరవీరై ర్జాతికుసుమై శ్చమ్పకై ర్వకులైశుభై
శాతపత్రైశ్చ కల్హారై రర్చయే పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమః పుష్పాణి పూజయామి.
అధాంగ పూజ:
ఓం అనంతాయ నమః - పాదౌ పూజయామి
ఓం శేషయ నమః - గుల్భౌ పూజయామి
ఓంకాలాత్మనే నమః - జంఘే పూజయామి
ఓం విశ్వరూపాయ నమః - జానునీ పూజయామి
ఓం జగన్నాదాయ నమః - గుహ్యం పూజయామి
ఓం పద్మనాభాయ నమః - నాభిం పూజయామి
ఓం సర్వాత్మనే నమః - కుక్షిం పూజయామి
ఓం శ్రీ వత్సవక్షసే నమః - వక్షస్థలం పూజయామి
ఓం చక్రహస్తాయ నమః - హస్తాన్ పూజయామి
ఓం ఆజానుబాహవే నమః - బాహూన్ పూజయామి
ఓం శ్రీ కంటాయ నమః - కంటం పూజయామి
ఓం చంద్రముఖాయ నమః - ముఖం పూజయామి
ఓం వాచాస్పతయే నమః - వక్త్రం పూజయామి.
ఓం కేశవాయ నమః - నాసికాం పూజయామి
ఓం నారాయణాయ నమః - నేత్రే పూజయామి
ఓం గోవిందాయ నమః - శ్రోత్రే పూజయామి
ఓం అనంతపద్మనాభాయ నమః - శిరః పూజయామి
ఓం విష్ణవే నమః - సర్వాంగణ్యాని పూజయామి
అనంతపద్మనాభ స్వామి అష్ట్తోతరము
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః
ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతాయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యొతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యాదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమఃఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శ్యమంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం మురారినే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకృతే నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్థసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః
తోరగ్రదిం పూజ:
ఓం కృష్ణాయ నమః - ప్రధమ గ్రంధిం పూజయామి
ఓం విష్ణవే నమః - ద్వితీయ గ్రంధిం పూజయామి
ఓం జిష్ణవే నమః - తృతీయ గ్రంధిం పూజయామి
ఓం కాలాయ నమః - చతుర్ధ గ్రంధిం పూజయామి
ఓం బ్రహ్మనే నమః - పంచమ గ్రంధిం పూజయామి
ఓం భాస్కరాయ నమః - షష్టమ గ్రంధిం పూజయామి
ఓం శేషయ నమః - సప్తమ గ్రంధిం పూజయామి
ఓం సోమాయ నమః - అష్టమ గ్రంధిం పూజయామి
ఓం ఈశ్వరాయ నమః - నవమ గ్రంధిం పూజయామి
ఓం విశ్వాత్మనే నమః - దశమ గ్రంధిం పూజయామి
ఓం మహాకాలాయ నమః - ఏకాదశ గ్రంధిం పూజయామి
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః - ద్వాదశ గ్రంధిం పూజయామి
ఓం అచ్యుతాయ నమః - త్రయోదశ గ్రంధిం పూజయామి
ఓం అనంతపద్మనాభాయ నమః - చతుర్దశ గ్రంధిం పూజయామి
ధూపం:
శ్లో: వనస్పతి రసైర్దివ్యై ర్నానా గంధైశ్చ సంయుతం
ఆఘ్రేయ సర్వదేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం
ఓం అనంతపద్మనాభాయ నమః దూపమాఘ్రాపయామి.
దీపం:
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజినామ్మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపాహం
ఓం అనంతపద్మనాభాయ నమః దీపం దర్శయామి.
నైవేద్యం:
శ్లో: నైవేద్య గృహ్య దేవేశ భక్తిమే హ్యచాలాంకురు
ఈప్సితం మే వరం దేవహి పరత్రచ పరాం గతిం
అన్నం చతుర్విధం భక్ష్యై రసై షడ్భి సమన్వితం
మయానివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్ధన.
ఓం అనంతపద్మనాభాయ నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం:
శ్లో: ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం.
ఓం అనంతపద్మనాభాయ నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
శ్లో: సమ సర్వహితార్దాయ జగదాధార మూర్తయే
సృష్టి స్తిత్యంత్యరూపాయ అనంతాయ నమోనమః
ఓం అనంతపద్మనాభాయ నమః నీరాజనం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారాన్:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రనస్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం క్రుపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన
నమస్తే దేవేదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ.
ఓం అనంతపద్మనాభాయ నమః ప్రదిక్షణ నమస్కారాన్ సమర్పయామి.
తోరగ్రహణం:
శ్లో: దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవ్రుద్దయే
అనంతాఖ్య మేడం సూత్రం దారయామ్యః ముత్తమం
ఓం అనంతపద్మనాభాయ నమః తోరగ్రహణం కరిష్యామి.
తోరనమస్కారం:
శ్లో: అనంత సంసార సముద్ర
మాగ్నం మమభ్యుద్దర వాసుదేవ
అనంతరూపిన్ వినియోజయస్వ
హ్యనంత సూత్రాయ నమోస్తుతే
ఓం అనంతపద్మనాభాయ నమః తోరనమస్కారాన్ సమర్పయామి.
తోరబంధనం:
సంసార గాహ్వారగుహాసు సుఖం విహర్తుం
వాన్చంతి ఏ కురు కులోద్వః శుద్దసత్వా
సంపూజ్యచ త్రిభువనేశ మనంతరూపం
బద్నంతి దక్షణ కారే వరదోరకం తే.
ఓం అనంతపద్మనాభాయ నమః టోర బంధనం కరిష్యామి.
జీర్నతోరణం విసర్జనం:
శ్లో: అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక
సూత్రగ్రందిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః
ఉపాయనదానం :
శ్లో: అనంతః ప్రతిగ్రుహ్న్నతి అనంతోవై దదాతిచ
అనంత స్తారకోభాభ్యా మనంతాయ నమోనమః .
శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత కథ
ఈ పరమ పవిత్రమైన కథను నైమిషారణ్యంలో సూతమహర్షి శౌనకాది మహామునులకు చెబుతున్నారు.
పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించేందుకు శ్రీకృష్ణుపరమాత్మ వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు.
కుశలప్రశ్నలయ్యాక "హే కృష్ణా..! మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచమని" ధర్మరాజు ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ ఆచరించమని సలహా ఇచ్చాడు. వెంటనే ధర్మరాజు... కృష్ణా! అనంతుడంటే ఎవరు? అని ప్రశ్నించాడు.
దాంతో కృష్ణ పరమాత్మ ‘ధర్మరాజా.. అనంత పద్మనాభుడంటే మరెవ్వరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మనాభస్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నాయందు పదునలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తరుషులు, చతుర్దశ భువనాలు,ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించు’ అన్నాడు శ్రీకృష్ణుడు.
ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి, ఇంతకు ముందు ఎవరైనా చేసారా?’ అని ధర్మరాజు మళ్ళీ ప్రశ్నించడంతో శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం కృతయుగంలో వేదవేదాంగవిదుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్తవయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో సుమంతడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమ గయ్యాళి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని, కౌండిన్యమహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్పగా ఆమె అల్లుడని కూడా చూడకుండా "ఇంట్లో ఏమీ లేదంటూ" అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెండ్లికోసం వాడగా మిగిలిన సత్తుపిండినే అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు.
సుగుణవతి తన భర్తతో కలసి వెడుతూ దారిలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి, అనంత పద్మనాభస్వామి వ్రతం చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఇదేమిటని ఆ స్త్రీలను అడగటంతో ఇలా చెప్పారు.
‘ఓ పుణ్యవతీ...ఇది అనంత పద్మనాభ వ్రతం. దీన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ, నదీస్నానం చేసి, ఎర్రని చీర ధరించి, వ్రతంచేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకు దక్షిణ భాగంలో కలశాన్ని ఉంచి, వేదికు మరో భాగంలోకి యమునాదేవిని, మద్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభస్వామిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించాలి.
పూజాద్రవ్యాలన్నీ 14 రకాలుండేలా చూసుకోవాలి. కుంకుమతో తడిపిన పదునాలుగు ముడులుగల నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభస్వామి సమీపంలో ఉంచి పూజించాలి. గోధుమపిండితో 28 అరిసెలు చేసి, స్వామికి నైవేద్యం పెట్టి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. దోరాన్ని కుడిచేతి కి ధరించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి.’ అని చెప్పారు.
సుగుణవతి అక్కడే వెంటనే అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది.
కాలక్రమంలో ధనంవల్ల కౌండిన్యునకు గర్వం పెరిగింది. ఒకయేడు సుగుణవతి వ్రతంచేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యడు ఆ తోరాన్ని చూసి, కోపంగా ‘ ఎవర్ని ఆకర్షించాలని ఇది కట్టావు’ అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేసాడు. అంతే...ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై, దరిద్రులైపోయారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలై ‘అనంత పద్మనాభస్వామిని’ చూడాలనే కోరిక ఎక్కువైంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు.
మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడిచెట్టు పైన ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే...పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని.., పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను..మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న గాడిదను, ఏనుగును చూసి.... ఆశ్చర్యపోతూ ‘మీకు అనంత పద్మనాభస్వామి తెలుసా?’ అని అడిగాడు.‘తెలియదు’ అని అవన్నీ జవాబిచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభస్వామికి అతనిపై జాలికలిగి ఓ వృద్ధబ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరకొచ్చి, సేదదీర్చి తన నిజరూపం చూపించాడు.
కౌండిన్యుడు ఆ స్వామిని పలువిధాల స్తుతించాడు. తన దరిద్రం తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు.
సంతోషించిన కౌండిన్యుడు తను మార్గ మధ్యంలో చూసిన వింతలు గురించి ఆ స్వామిని అడిగాడు. ‘విప్రోత్తమా.. తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడిచెట్టుగానూ, మహాధనవంతుడై పుట్టినా..అన్నాతురులకు అన్నదానం చేయని వాడు అలా ఒంటరి ఆబోతుగానూ, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగానూ, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగానూ, ధర్మం తప్పి నడచేవాడు ఏనుగులాగ జన్మిస్తారు. నాకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేసాను. నీవు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీవిష్ణుమూర్తి.
అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగిన. సంగతి అంతా భార్యకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు.
అంటూ సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ గురించి చెప్పాడు.
"సర్వం శ్రీకృష్ణార్పణమస్తు"
#దయచేసి_షేర్_చేయండి
#సంభవామి_యుగే_యుగే
ఓం నమో భగవతే అనంత పద్మనాభాయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి