*ఇది తెలుగు వర్ణ మాల ప్రకారం వరుస అక్షర క్రమంలో మలచినది*
*By: Parupalli Sriramachandramurthy:*
👇🏿
*అ* చలంబుగదరా ఘనమైన మనతెలుగు
*ఆ* నందగనిగదా శ్రవణమున మనతెలుగు
*ఇ* క్షురసమేగాద పలుకులో మనతెలుగు
*ఈ* డాడ ఏడైన మధురమే మన తెలుగు
*ఉ* ర్విలో ఘనమైన భాషరా మనతెలుగు
*ఊ* యలలు వూపురా గానాన మన తెలుగు
*ఎ* గసిఎగసీదూకు అలకదర మన తెలుగు
*ఏ* రువాకల వెలుగు పున్నమిర మనతెలుగు
*ఐ* రావతము పగిది భాషలను మన తెలుగు
*ఒ* నరంగ పలురసాగ్రేసరము మనతెలుగు
*ఓ* లలాడెడి సుధావాహినిర మనతెలుగు
*ఔ* రౌరయనిపించు భాషరా మనతెలుగు
*అం* దరీ మనసులూ దోచేటి మనతెలుగు
*అః* ఆహా యనీ మెచ్చేటి మన తెలుగు
*క* వనాలు కవితలకు దొడ్డదిర మనతెలుగు
*ఖం* డకావ్యాల కలకండరా మన తెలుగు
*గ* ణనీయమైనదీ పలుకులో మనతెలుగు
*ఘ* నకీర్తిపొందెగా నలుచెరగు మనతెలుగూ
*ఙా* నార్జనా పట్టు కొమ్మరా మన తెలుగు
*చ* తురతకే కాణాచి గదరా మనతెలుగు
*ఛ* త్రము పట్టించుకున్న భాషర మనతెలుగు
*జ* లధారపరుగులా ఝరికాదా మనతెలుగు
*ఝం* కారనాద ఓంకారమే మనతెలుగు
*టం* కార శబ్దంపు విలునారి మనతెలుగు
*ఠ* క్కున మదిలోనిలచూ మానితమౌమనతెలుగు *డాం* బికమైనదిగాదా భాషలందు మనతెలుగు
*ఢ* మరుకనాదంబిదియే తిరుగులేని మనతెలుగు
*ణా* ణ్యంబగు మేటిభాష తెలుసునా మనతెలుగు
*త* రగనినిధిగానిలచిన ధనముకదా మనతెలుగు
*థ* ధ్యముగా సలలితమౌ భాషగదా మనతెలుగు
*ద* వనముమరువపుగట్టిన మాలేరామనతెలుగు
*ధ* నసుగదా భాషాభండనమున మనతెలుగు
*న* వనవోన్మేషజిలుగు వెలుగురా మనతెలుగు
*ప* రిమళాలగుభాళించువిరివనమూమనతెలుగు
*ఫ* లరసములవంటి మధుర భాషరా మనతెలుగు
*బ* మ్మెరాదుల కావ్యసంపదే మనతెలుగు
*భా* గవతమైరంజిల్లిన భక్తిలహరి మనతెలుగు
*మ* హాత్ములామన్ననలే పొందినదీ మనతెలుగు
*య* తిప్రాసలపద్యాలకునిలయమేమనతెలుగు
*ర* మణీయఅవధాన కొలువురా మనతెలుగు
*ల* లితలావణ్యంపు సుమసమము మనతెలుగు
*వ* రలేటి పలుకళల పలుకుబడి మనతెలుగు
*శ* రత్కాలపుచంద్ర బింబమ్ము మనతెలుగు
*ష* డృచుల మిశ్రమపు గరిమరా మనతెలుగు
*సం* గీతసాహిత్యసత్కీర్తి మనతెలుగు
*హ* రికధాప్రక్రియకు సదనంబు మన తెలుగు *ళ* కూడ యందముగా ఒదిగున్న మనతెలుగు
*క్ష* రరహితయక్షరపు దేవతలె మనతెలుగు
**********
*By: Parupalli Sriramachandramurthy:*
👇🏿
*అ* చలంబుగదరా ఘనమైన మనతెలుగు
*ఆ* నందగనిగదా శ్రవణమున మనతెలుగు
*ఇ* క్షురసమేగాద పలుకులో మనతెలుగు
*ఈ* డాడ ఏడైన మధురమే మన తెలుగు
*ఉ* ర్విలో ఘనమైన భాషరా మనతెలుగు
*ఊ* యలలు వూపురా గానాన మన తెలుగు
*ఎ* గసిఎగసీదూకు అలకదర మన తెలుగు
*ఏ* రువాకల వెలుగు పున్నమిర మనతెలుగు
*ఐ* రావతము పగిది భాషలను మన తెలుగు
*ఒ* నరంగ పలురసాగ్రేసరము మనతెలుగు
*ఓ* లలాడెడి సుధావాహినిర మనతెలుగు
*ఔ* రౌరయనిపించు భాషరా మనతెలుగు
*అం* దరీ మనసులూ దోచేటి మనతెలుగు
*అః* ఆహా యనీ మెచ్చేటి మన తెలుగు
*క* వనాలు కవితలకు దొడ్డదిర మనతెలుగు
*ఖం* డకావ్యాల కలకండరా మన తెలుగు
*గ* ణనీయమైనదీ పలుకులో మనతెలుగు
*ఘ* నకీర్తిపొందెగా నలుచెరగు మనతెలుగూ
*ఙా* నార్జనా పట్టు కొమ్మరా మన తెలుగు
*చ* తురతకే కాణాచి గదరా మనతెలుగు
*ఛ* త్రము పట్టించుకున్న భాషర మనతెలుగు
*జ* లధారపరుగులా ఝరికాదా మనతెలుగు
*ఝం* కారనాద ఓంకారమే మనతెలుగు
*టం* కార శబ్దంపు విలునారి మనతెలుగు
*ఠ* క్కున మదిలోనిలచూ మానితమౌమనతెలుగు *డాం* బికమైనదిగాదా భాషలందు మనతెలుగు
*ఢ* మరుకనాదంబిదియే తిరుగులేని మనతెలుగు
*ణా* ణ్యంబగు మేటిభాష తెలుసునా మనతెలుగు
*త* రగనినిధిగానిలచిన ధనముకదా మనతెలుగు
*థ* ధ్యముగా సలలితమౌ భాషగదా మనతెలుగు
*ద* వనముమరువపుగట్టిన మాలేరామనతెలుగు
*ధ* నసుగదా భాషాభండనమున మనతెలుగు
*న* వనవోన్మేషజిలుగు వెలుగురా మనతెలుగు
*ప* రిమళాలగుభాళించువిరివనమూమనతెలుగు
*ఫ* లరసములవంటి మధుర భాషరా మనతెలుగు
*బ* మ్మెరాదుల కావ్యసంపదే మనతెలుగు
*భా* గవతమైరంజిల్లిన భక్తిలహరి మనతెలుగు
*మ* హాత్ములామన్ననలే పొందినదీ మనతెలుగు
*య* తిప్రాసలపద్యాలకునిలయమేమనతెలుగు
*ర* మణీయఅవధాన కొలువురా మనతెలుగు
*ల* లితలావణ్యంపు సుమసమము మనతెలుగు
*వ* రలేటి పలుకళల పలుకుబడి మనతెలుగు
*శ* రత్కాలపుచంద్ర బింబమ్ము మనతెలుగు
*ష* డృచుల మిశ్రమపు గరిమరా మనతెలుగు
*సం* గీతసాహిత్యసత్కీర్తి మనతెలుగు
*హ* రికధాప్రక్రియకు సదనంబు మన తెలుగు *ళ* కూడ యందముగా ఒదిగున్న మనతెలుగు
*క్ష* రరహితయక్షరపు దేవతలె మనతెలుగు
**********
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి