1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఇంటిపేర్లతో ఇరకాటం

🚩
(పెళ్లిళ్ల శాస్త్రి గారిస్వగతం)

😀
లంకా వారి అమ్మాయిని చేసుకోమని అడివి వారికి చెవినిల్లు
కట్టుకు చెప్పాను. ఉహూ ! వాళ్లకి సొక్కలా.
😀నాకు ఒళ్లు మండింది. త్రేతాగ్నులవారి అమ్మాయిని తెచ్చి
అడివి వారికి అంటించాను.
కొంప భస్మమై పోయిందని అడివి వారి గోల. కానీ త్రేతాగ్నులవారితోనూ గోలే. అల్లుడు పాడైతే అమ్మాయి మాత్రం బాగుపడ్డట్టా? అని.

😀పోన్లెమ్మని ఈ సారి జలసూత్రం వారి అమ్మాయిని తెచ్చి
త్రేతాగ్నుల వారి నెత్తి మీద దింపాను.
ఈ సారి కొంప ఆరిపోయిందనీ, ఇంట్లో పొయ్యి కూడా వెలగటం
లేదనీ త్రేతాగ్నుల వారితో మళ్లీ గోల .
అమ్మాయికి రోజూ టెంపరేచర్ వొస్తోందని జలసూత్రం
వారితోనూ గోలే.
😀పాపం త్రేతాగ్నుల వారి మీద జాలేసి ఈ సారి నేతి వారి అబ్బాయికి త్రేతాగ్నుల వారి అమ్మాయిని కట్టబెట్టించాను.
దీని దుంప తెగ ! త్రేతాగ్నుల వారి అమ్మాయి ధగధగా వెలిగిపోతోంది కానీ నేతి వారి అబ్బాయి బక్క చిక్కి శల్యమై పోయాడు
.
😀 పప్పు వారి అమ్మాయి ఉంది. చక్కగా పచ్చని చాయతో ఉంటుంది. ఆ అమ్మాయిని తెచ్చి నేతి వారితో ముడిపెట్టాను.
మిసమిస లాడుతూ నేతి వారి అబ్బాయి, పచ్చని చాయతో పప్పు వారి అమ్మాయి హాయిగా కాపరం చేసుకుంటున్నారు.
😀
(పైవన్నీ బ్రాహ్మల ఇంటి పేర్లు. ఈ జోక్ 25 సం: క్రితం ఆంధ్ర జ్యోతిలో మిత్రులు ధనికొండ రవిప్రసాద్ గారి చతురత )

😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

కామెంట్‌లు లేవు: