వందే గురు పరంపరామ్.
భక్తి వైరాగ్యముల కిల భరతవర్ష
మొన్నటికినైన కాణాచి వన్నె మెరసి
పుణ్యపదము ప్రభావమగణ్యమదియు
మాననీయులు ఋషులిట మనినకతన |
అట్టి మహిమాన్వితంబైన ఆర్యభూమి
కలియుగారంభమున కొద్ది కాలముననె
జనులు వర్ణాశ్రమంబుల జాడ మరచి
దెగడి పాపపు నడతల తిరిగిరకట|
జైన బౌద్ధాది చార్వాకు లనుగతములు ప్రబలె పాషండ మతముల భ్రమలు పెక్కు వాదమటులుంచి వర్గ విభేదమెంచి ప్రజలనైక్యత పాలైరి ప్రజ్ఞలుడిగి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి