1, సెప్టెంబర్ 2020, మంగళవారం

పోత‌న త‌ల‌పులో ‌...(39

)

అడుగ‌డుగునా కృష్ణ‌ప‌ర‌మాత్మ లీలా విశేషంతో
మ‌హాభార‌త యుద్దం ప‌రిస‌మాప్తి అయింది.

                            ***
పాంచాలీ కబరీవికర్షణమహాపాపక్షతాయుష్కులం,
జంచద్గర్వుల, ధార్తరాష్ట్రుల ననిం జంపించి, గోవిందుఁ డి
ప్పించెన్ రాజ్యము ధర్మపుత్త్రునకుఁ, గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే
యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్రప్రభావంబునన్.
                          ***

నిండుసభలో ద్రౌపదిని జుట్టుపట్టుకులాగిన మహాపాపం ఫలితంగా దుర్మదాంధులైన ధృతరాష్ట్రనందనులైన కౌరవుల ఆయుష్షులు క్షీణించాయి; వారందరినీ శ్రీకృష్ణుడు కురుక్షేత్రయుద్ధంలో చంపించి, ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు; విజయభేరి మ్రోగించి మహేంద్రవైభవంతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు; ధర్మరాజుకు గొప్ప పేరుప్రఖ్యాతులు తెప్పించాడు.

🏵️ *పోత‌న ప‌ద్యం*🏵️️ప‌ర‌మాత్మత‌త్వ ఆవిష్క‌ర‌ణం

కామెంట్‌లు లేవు: