1, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివామృతలహరి శతకం

.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
అరుగం జాదినగాని సాననిడి తానై పూఁతకున్ వచ్చునే
మెరుగౌ గంధపుఁజెక్క ; భక్తియను కొల్మింగాల్చి మర్థించకే
బిరుసౌ డెందము కుందనంబగు నొకో?భీష్మించి కూర్చుండియో
చెఱకా ! బెల్లము బెట్టుమన్న నిడునా ? శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;
గంధం పూసుకో వాలంటే గంధపు చెక్కను బాగా అరగ దీయ కుండా గంధం వస్తుందా?
అలాగే నిత్యం ఐహిక విషయాలతో భోగాశక్త మై కరడు గట్టి రాయిలా మారిన హృదయాన్ని భక్తి అనే కొలిమిలో బాగా కాల్చకుంటే బంగారంలా మారుతుందా.
చెఱకా బెల్లం బెట్టు అంటే వస్తుం దా?
మానవ ప్రయత్నం చేస్తేనే గదా భగవత్కృప లభించేది.
అని నాన్నగారి భావన.

కామెంట్‌లు లేవు: