6. దక్షిణామూర్తి తత్వం ---
పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు; అటు తర్వాత ఎందరెందరికో దర్శనమిచ్చాడు ఆయన. “సనకాది సమారాధ్యా శివ జ్ఞాన ప్రదాయినీ" అనే నామం దక్షిణామూర్తి నామం ప్రక్కప్రక్కనే ఉండడం వల్ల దక్షిణామూర్తి కథను అక్కడ చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. సనకసనందనాదులు బ్రహ్మవిద్యా మూర్తులు. వారు బ్రహ్మవిద్య కోసమే కైలాసానికి వెళ్ళారుట. ఆది గురువైన పరమేశ్వరుని వద్దకు. ఆ సమయంలో ఆయన నాట్యం చేస్తున్నాడట అమ్మవారితో కలిసి. దేవతలందరూ నాట్యం చేస్తున్నారు. అది చూసి ఈయన మనకి బ్రహ్మవిద్య యేమి చెప్తాడు? ఇంత సంసారం చేసుకొని నాట్యం చేస్తున్నాయన బ్రహ్మవిద్య ఏం చెప్తాడు? అని. ఎందుకంటే వేదాంతం అంటే ఎవరు చెప్పాలి? ఎలా చెప్పాలి అని ఒక scene ఉంది మనకి. మౌనంగా చెట్టుక్రింద కూర్చొని, అన్నీ వదిలేసిన వాడు చెప్తేనే వేదాంతం అని.
అన్నీ వదిలేయడం అంటే మనస్సుతో వదిలేయడం. బాహ్యంగా అన్నీ వదిలేసి లోపల బోలెడు పెట్టుకునే వారు మనకి చాలామంది దొరుకుతారు ఈ రోజులలో. వీరు నిరంతర బ్రహ్మవాదులు, బ్రహ్మవేత్తలు. నిరంతరం బ్రహ్మ గురించే చర్చలు చేసేవారు, భావించేవారు బ్రహ్మవాదులు. అలాంటి మహానుభావులు ఎప్పుడైతే ఇలా చూశారో వీళ్ళు ఇంక లాభం లేదు అని వెళ్ళిపోతున్నారుట. అయితే ఈ సందట్లో ఆయన వీళ్ళని చూడలేదు అనుకున్నారు. కానీ ఆయన చూడనిది ఎవరిని. ఇలా కొంతదూరం వచ్చేసరికి వారికి విస్తృతమైన వటవృక్షం కనిపించింది. దాని మూలంలో పదహారేళ్ళ కుర్రవాడు ఉన్నాడు. ఆయన చుట్టూ వృద్ధులైన శిష్యులున్నారు. అదిగో అక్కడ ఒక తేజోమయ మూర్తి కనపడుతున్నాడు అని ఆయన వద్దకు బయలుదేరారు. వారు అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత జరిగిన ప్రాప్తికి మాట, ప్రశ్న లేకుండా అయింది. యే మహామౌనానికి చేరితే సమాధానం లభిస్తుందో ఆ సమాధానం వాళ్ళకి లభించింది.
సమాధానం వేరు, జవాబు వేరు. Answer వేరు, Solution వేరు. నాకో డౌట్ అండీ అని వస్తారు. Doubt వస్తే ఇచ్చేది జవాబు. సమాధానం చర్చలవల్ల, మాటలవల్ల దొరికేది కాదు. సాధన, విచారణ వల్ల లభిస్తుంది.
సమాధానం వచ్చాక "ఈయన ఇలా చెప్పాడండీ"..అని లేదక్కడ.. అనుభూతి దగ్గర ఇంకేం ఉంటుందండీ? ఆ అనుభూతి స్థితే మౌనం. ఆ అనుభూతి ఎలాంటిది అంటే పరమహంస చాలా చక్కగా చెప్తారు. ఒక తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతున్నంత సేపూ చాలా రొద చేస్తుంది. కుసుమంలోకి చేరి మకరందం ఆస్వాదించేటప్పుడు పరమ మౌనంగా ఉంటుంది. కనుక అనుభూతి స్థితే మౌనం. బ్రహ్మం గురించి మాట్లాడడం కాదు, బ్రహ్మానుభవ స్థితి అందుకు ఆయన
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వంయువానం
వర్షిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
అని నమస్కారం చేశారు జగద్గురువుల వారు ఆ జగద్గురువుకి. మౌనవ్యాఖ్య. పైగా తాను వెళ్ళకముందే అందులో ఉన్నారట. అంటే ఈరోజు మీకోసం క్రొత్తగా కనపడిన వాడిని కాదు. ఎప్పుడెప్పుడు బ్రహ్మవేత్తలవ్వాలని తపనపడతారో అటువంటి వారికి నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని చెప్పడానికి ఈయన వెళ్ళేముందే
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||
అన్నట్లుగా వృక్షం మధ్య కనపడ్డారుట. ఆయన ముందుకు వెళ్ళేటప్పటికి వీరు కూడా పరమ శాంతిని పొందారు. ఆయనను చూడడంతోనే వారికి సమాధానం లభించిందట. ఇదేలాగండీ అంటే చీకటి తట్టుకోలేక దీపం వెలిగిస్తే దీపం వెలిగించడంతోటే అంధకారం పటాపంచలై పోతుంది. అలా స్వామియొక్క సాక్షాత్కారం చేత వీరికి సమస్త సందేహములకు సమాధానం లభించింది. అందుకే సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ. శివజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. శివం అంటే అర్థం ఏమిటి? "ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం" అని మాండుక్యోపనిషత్తులోని మాట.
అందుకు శివం అంటే ప్రపంచోపశమం శాంతం. ప్రపంచమంతా ఉపశమించిన తర్వాత ఏది ఉంటుందో ఆ శాంత స్థితి శివం. ప్రపంచం ఉపశమించడం అంటే నశించిపోవడం అని కాదు. ప్రపంచ దృష్టి నశించిన తరువాత ఏ పరమాత్మ తత్త్వం మిగిలి ఉంటుందో ఆపరమాత్వ తత్త్వమే శివం. కనుక ఉపనిషత్ప్రతిపాద్యమైన పరతత్త్వం పేరు శివం. శివ అనే శబ్దమే నేరుగా బ్రహ్మమును తెలియజేస్తున్నది. ఆ బ్రహ్మ జ్ఞానమివ్వడమే శివజ్ఞాన ప్రదాయినీ అని అర్థం. 🙏🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి