🙏మహాకవి బాణుడు🙏
సంస్కృత సాహిత్యంలో విశేష ప్రజ్ఞపాటవములు కలిగిన కవులలో బాణునకు ప్రముఖ స్థానమున్నది. ఆ మహనీయుని గురించి తెలుసుకుందాము
పద్యకావ్యములనియు, గద్యకావ్యములనిము చంపూకావ్యములనిము, కావ్యములు మూడు విధములు, హర్షచరిత్ర, కాదంబరి, వాసవదత్త, దశకుమార చరిత్ర, గద్యచింతామణి, తిలక మంజరి మొదలగునవి గద్యకావ్యములు, రఘువంశము, శిశుపాలవధ మొదలగునవి పద్యకావ్యములు. గద్యపద్యాత్మక మైనవి చంపూకావ్యములు. అవి రామాయణ చంపు, భారతచంపు, త్రివిక్రమచంపు మొదలైనవి. పైన జెప్ప బడిన గద్యకావ్యములలో కాదంబరీ హర్షచరిత్రములు బాణకవి విరచితములు. కాదంబరి గద్యకావ్యములన్నింటిలో రసవత్తమము. దానిని మించినగద్య కావ్యము ఏ నాఙ్మయములోనులేదని నిశ్చయముగా చెప్పగలను. "కాదంబరీరసజ్ఞానామాహారో పినరోచతే” దాని రసవత్తరము వచింపబడినది. మొదటికృతియగుట చేతనో మరియే కారణముచేతనో గాని హర్ష చరిత్రము కాదంబరికంటె కఠినతరశబ్ద భూయిష్టమైయున్నది. కాదంబరి కధ. వాస్తవచరిత్రకు సంబంధించినది కాదు. అదిపురాణకథవంటిది. హర్షచరిత్రము వాస్తవకథ.
సూర్య శతకకర్త మయూరుని భార్య ఒక ఆడుబిడ్డను కని గతించింది. క్రమంగా ఆ పిల్ల పెరిగిపెద్దదైనది. బాణునికిచ్చి మయూరుడు కన్యాఫలదానం గడించుకున్నాడు అని పూర్వకవుల వచనము బట్టి బాణుడు, మయూరుడు సమకాలీకులనీ తెలియుచున్నది.
హర్ష వర్ధన మహారాజు ఆస్థానకవి అయిన బాణ భట్టు ఏడవ శతాబ్దానికి చెందిన వాడు .606-647అసలుకాలం గా భావిస్తారు .స్థానేశ్వర అనిపిలువబడే నేటి కనోజ్ జన్మ స్థలం .హర్షుని జీవితచరిత్రను హర్ష హరిత్రగా రాశాడు .బాణుడి ‘’కాదంబరి ‘’జగత్ ప్రసిద్ధం .’’బట్ట బాణుని ముద్దు పట్టి కాదంబరి కధలు చెప్పు చెల్మి కత్తేనాకు ‘’అని తెలుగుకవి ప్రశంసలనందుకొన్నాడు బాణుడు .సంస్కృతం లో తోలి వచన కావ్యం కాదంబరి .ఈ కదా నవలను పూర్తీ చేయకుండానే మరణిస్తే కుమారుడు భూషణ భట్టు పూర్తీ చేశాడని అంటారు బాణుడు చండికా శతకం, పార్వతి పరిణయం నాటకం రాశాడని చెబుతారు .ఈ రెండు గ్రంధాలలో ఆయన చెప్పుకొన్న విషయాల వల్లనే జీవిత చరిత్ర తెలుస్తోంది .’’ముకుట తాడితం ‘’అనే నాటకాన్ని కూడా రాశాడని చంద్రపాలుడు ,గుణ విజయ గణులు చెప్పారు .కాని అది బాణ కృతం కాదు .పార్వతీ పరిణయం వామన భట్ట బాణుడు రాశాడంటారు .కాదంబరి మాటకు నానార్దాలున్నాయి –ఆడుకోయిల ,గోరింక, మద్యం .కోయిల గానం గా పరవశాన్ని కల్గిస్తుంది .గోరింక ళా ముచ్చటగా ఉంటుంది మద్యం లా హృదయానికి కిక్కు ఇస్తుందని సరదాగా మనం అర్ధం చెప్పుకోవచ్చు .
బాణుడి తండ్రి చిత్ర భాను తల్లి రాజా దేవి .హిరణ్య బాహు నదీ తీరం లో ఈ నాటి బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలోని ప్రీతి కూట లో పుట్టాడు .భోజక కుటుంబం లో వాత్సాయన గోత్ర సంభవుడు .దేశ సంచారం చేస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు .హర్షుడి తమ్ముడు కృష్ణుడు ఆహ్వానం పంపితే వెళ్ళాడు .మనితర లో ఉన్న హర్ష వర్ధనుడిని కలుసు కొన్నాడు .మూకాభినయం తో , కోపాభినయం తో హర్షుని మనసును ఆకర్షించాడు .ఈ నాటి ఔరంగా బాద్ లో హాస్పురా జిల్లాలోని పీరూ గ్రామం లో బాణుడు జన్మించాడని మరోకధనం .’’బాణోచ్చిస్టమిదం జగత్ ‘’అని లోకం లో సామెత ఉంది .అంటే బాణుడు ముట్టి వదలనిదేదీ లేదు .అనగా ఉన్నదంతా బాణుడు ఎంగిలి చేసి వదిలినదే అని భావం. అనగా బాణుడు ఉపయోగించని సంస్కృత పదంలేదు. సంస్కృతపదాలు మొత్తం ఉపయోగించాడని భావం.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి