ఉ.మా గురువుల్ పరాశరులు మాన్యులు వేద పురాణ వేద్య సం
యోగులు, వాగ్మి, ప్రాజ్ఞులు మహోన్నత గోకుల నాథ కృష్ణులా
వాగనుశాసనుం దయను పద్యములన్ రచియింప నేర్చి నే
నీగతి నిల్చి, భక్తి స్మరియించుచుఁ గొల్చుచునుందు భారతీ!౹౹ 103
మ.ముదిగొండాన్వయ వీరభద్రులు దయన్ మోదమ్ముతో నెంచి యీ
సదసద్భావ విశేష నైపుణిని నీ సాహిత్య సాంగత్యమున్
మదికిన్ గూర్చ గ్రహించి, ధీపతులు, సమ్యగ్భావ సంధాన కో
విదులన్ సన్నుతిఁ జేయుచుందుఁ గొలుతున్ వేడ్కన్ సదా భారతీ!౹౹104
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి