(ప్రస్తుత విపత్కర కొరోనా దృష్ట్యా మరియు 2020నవంబర్ 21 నుండి గురువు మకరమునందు శనితో సంచరించుట వలన
వాతావరణం లో ఆనారోగ్యసమస్యలు(కలరా లాంటివి) 2021మార్చి మాసాంతము వరకూ భవిషత్తులో రాగల అవకాశాలు ఉన్నందున
(మకరగురవునీచం లో,దక్షిణాయన రవి బలహీనుడుగాను,మకర శని స్వస్థానమునందు బలవంతుడైనందున)
ఈ వ్యాసమును పోస్ట్ చేస్తున్నాను.
ప్రధానంగా వైదిక వృత్తి లో ఉన్న సభ్యులు అందరూ నన్ను క్షమించవలసినదిగా ప్రార్థిస్తూ🙏🙏🙏
మనలో చాలామందికి ఒక భావన వున్నది అది ఆబ్దికం అంటే ఇద్దరు బ్రాహ్మణులు (భోక్తలు) ఒక బ్రాహ్మణుడుమంత్రం చెప్పాలి అదే ఆబ్దికం అని.
నిజానికి మన హిందూధర్మం చాలా గొప్పది మనం ఎటువంటి స్థితిలో వున్నా మన ధర్మాన్ని పాటించటానికి తగిన మార్గాలు మన మహర్షులు సూచించారు. కేవలం మనం వాటిని తెలుసుకొని ఆచరించటమే. ఈ విషయం గూర్చి తరువాత విస్తృతంగా వివరించ ప్రయత్నిస్తాను.
ఇప్పుడు మనం కరోనా భయంతో వున్నాము మనం బ్రాహ్మణులను ఇంటికి పిలిచి యధావిధిగా ఆబ్దికాన్ని ఆచరించే స్థితిలో లేము అంతే కాక ఒక బ్రాహ్మణుని కూడా పిలిచి బ్రహ్మార్పణంగా కూడా తంతు జరిపించే పరిస్థితి లేదు. వేరే చోటికి అంటే ఆబ్దిక కేంద్రాలకు, మఠాలకు వెళ్లే పరిస్థితి అస్సలు కాదు బైట తిరిగితే ఏమవుతుందా అని భయం. మరైతే తత్దిన్నం ఎలా పెట్టాలి. ఈ విషయమై నేను పలువురుసంప్రదాయము పట్ల అవగాహన ఉన్న పెద్దలను సంప్రదించినాను. దైవానుగ్రహంతో నాకు పరిష్కారం దొరికింది. నాలా ఇంకా మన మిత్రులు ఇలాగే ఆలోచిస్తూవుంటారని వారి నుద్దేశించి ఇది వ్రాస్తున్నాను.
దయచేసి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ బంధువులు నన్ను అపార్ధం చేసుకోవద్దని మనవి🙏.
యెవ్వరూ బ్రాహ్మణులు లేకుండా కేవలం కర్త మాత్రమే నిర్వహించే శ్రార్ధ క్రియను దర్శ శ్రార్థం అంటారు.
ఈ శ్రార్ధ విధి చేయటానికి మీకు ఎలాంటి వైదిక జ్ఞానం అవసరంలేదు. కేవలం మీరు మా పితృదేవతల శ్రార్ధ విధిని చేయాలనేఆసక్తి మరియు శ్రద్ద ఉంటే చాలు.
చేసే విధానం.
ఈ విధానం కోసం మీరు మీ వాట్సాప్ నంబరు మరియు మీ గోత్ర నామాలు పెడుతూ (ప్రవర) ఇక్కడ కామెంట్ చేయగలరు. మీకు వ్యక్తిగతంగా ఆ క్రియ విధానం తెలియపరచబడును. ఎందుకంటె అవసరం లేనివారికి ఆ విషయాలు తెలపటం ఎందుకని ఈ ఏర్పాటు చేయడమైనది.
ఒక్క విషయం. మీరు ఈ బ్లాగు ఫాలోవర్ కావటం మరవవద్దు.
*************************
ఈ విధానం కోసం మీరు మీ వాట్సాప్ నంబరు మరియు మీ గోత్ర నామాలు పెడుతూ (ప్రవర) ఇక్కడ కామెంట్ చేయగలరు. మీకు వ్యక్తిగతంగా ఆ క్రియ విధానం తెలియపరచబడును. ఎందుకంటె అవసరం లేనివారికి ఆ విషయాలు తెలపటం ఎందుకని ఈ ఏర్పాటు చేయడమైనది.
ఒక్క విషయం. మీరు ఈ బ్లాగు ఫాలోవర్ కావటం మరవవద్దు.
*************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి