15, డిసెంబర్ 2025, సోమవారం

పంచె కట్టున నున్న

  పంచె కట్టున నున్న పారమార్థికమును

   కన్పింపజేయు సంక్రాంతి లక్ష్మి,

పట్టు పరికిణీల ప్రమదలు నడయాడ

   సంతసమ్మందు సంక్రాంతి లక్ష్మి,

హరిలొ రంగాయన్న హరిదాసు కీర్తనన్

    శ్రాంతిని బాపు సంక్రాంతి లక్ష్మి,

బసవని యాటలో పరవశత్వమునంది

   బ్రతుకు పండించు సంక్రాంతి లక్ష్మి,

ముంగిటను నున్నరంగులమ్రుగ్గులందు

ప్రీతినిల్పిన బంతి పరీమళముల

నలరి గృహముల ధనధాన్యముల నొసంగు

రమ్య కరుణాంతరంగ సంక్రాంతిలక్ష్మి

భోగభాగ్యమ్ము లొసగుచు బ్రోచుగాక!


మకర సంక్రాంతి శుభకామనలతో

కామెంట్‌లు లేవు: