15, డిసెంబర్ 2025, సోమవారం

శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ శతకం.

  మాతృ శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ శతకం. -డా.గుడి‌సేవ.విష్ణుప్రసాద్.

6.

గురుతు చూపించు వాడిపో గురుడటంచు

చెప్పినావమ్మ మా తల్లి శిష్యులకును 

దారి చూపించి జనులకు ధైర్యమిచ్చి

ముక్తినొసగుముజిల్లెళ్ళమూడియమ్మ! 

విధిని మార్చంగ లేవయ్య తిధులు చూడ 

రాళ్లుమార్చంగలేవయ్య రాతనెపుడు

అనుచు సద్బోధచేసిన అమ్మవీవు

ముక్తినొసగుముజిల్లెళ్ళమూడియమ్మ! 

8.

ఎంతవెదుకులాడినగాని సుంతయైన

ఆత్మకానిదిలేదుయీఅవనియందు

అన్నసత్యంబు తెల్పిన అమ్మవీవు

ముక్తినొసగుముజిల్లెళ్ళమూడియమ్మ! 

9.

మాతలకును మాతవుజగన్మాతవీవు

ముజ్జగంబుల నేలెడి మూర్తివీవు

అంబ!జగదంబ!కాపాడి అవనిప్రజకు

ముక్తినొసగుముజిల్లెళ్ళమూడియమ్మ! 

10.

ఆకలనుచును వచ్చిన ఆర్తులకును

అన్నదానంబుచేసెడిఅమ్మవీవు

జ్ఞానదానంబుచేయుచుజగతిజనుల ముక్తినొసగుముజిల్లెళ్ళమూడియమ్మ!

కామెంట్‌లు లేవు: