పెండ్లికల
పరతత్త్వనిర్ణయము
తే.గీ॥
మంగళాశాసనమను నా మహితవాక్కు
పావనమగు పల్లాండుగ బరగి పుడమి
నర్చనమ్ముల స్తోత్రపారాయణముల ఆదిపఠనీయమౌ రీతి నలరె నదియె 77
తే.గీ॥
భట్టనాథుని పూజించి బహువిధముల
బహుమతులు పట్టు
పుట్టముల్ బహుళమొసగి
రథతురగ భటులును వెంట రాగ, నటుల
సత్కరించి పల్లవరాజు సాగనంపె 78
మ॥
వితతద్రావిడపాశురమ్ములు, మనోవిశ్వాసయుక్తమ్ముగా
స్తుతులన్ చిత్తమునన్ తలంచుచుసుర
స్తుత్యాచ్యుతశ్రీపద
ద్వితయైకైకశరణ్యలబ్ధులకు తా పేరొందు దాసుండుగన్
ప్రతిభాపాటవకీర్తిఁ గాంచె పెరియాళ్వార్లంచు శ్లాఘించగన్ 79
గోదాదేవి
ఉ॥
అంతట నొక్క నాడుదయమందున నాతడు పూర్వఫల్గుణిన్
చెంతన నున్న పుష్పతులసీ
వనికిన్ జని పూలుద్రుంచఁ ద
త్ప్రాంతము నందు నొక్క పసిపాపను గాంచుచు ప్రేమమీరఁ దా
నెంతయొ సంతసిల్లి హరి యిచ్చిన బిడ్డగ దల్చె నయ్యెడన్ 80
కంజర్ల రామాచార్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి