26, నవంబర్ 2023, ఆదివారం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


నేను విశ్వామిత్రులవారి భార్యను. వీడు మా అబ్బాయే. విషమపరిస్థితిని తట్టుకోలేక వీడిని అమ్మెయ్యడానికి

తీసుకుపోతున్నాను. మాకు చాలా రోజులుగా అన్నం లేదు. నా భర్త తపస్సుకు వెళ్ళాడు. వీడిని అమ్మేసి

వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ.

ఓ పతివ్రతా ! ఈ పుత్రుణ్ణికూడా రక్షించుకో. వెనక్కి వెళ్ళు. నీ భర్త తపస్పునుంచి తిరిగివచ్చే

వరకూ మీకందరికీ ఆహారం నేను అందిస్తాను. మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజూ ఆహారం కట్టి

వెడుతుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నామాట నమ్ము. నేను అరుణపుత్రుణ్ణి. రాకుమారుణ్ణి. నా పేరు

సత్యవ్రతుడు.

సరేనని ఆ తల్లి కొడుకు మెడలో బంధనం విప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. గళబంధనం

కారణంగా ఆనాటినుంచి ఆ మునికుమారుడు “గాలవుడు” అయ్యాడు. ఆశ్రమం చేరుకుని మిగతా

పుత్రులను చేరబిలుచుకుని గాఢంగా కౌగిలించుకుంది. కష్టాలు తీరాయికదా, ఇక ప్రాణాపాయం లేదని

సంబరపడింది.

పత్యవ్రతుడు మాట తప్పలేదు. అడవిలో మృగాలను వేటాడి రోజూ ఏదో ఒక సమయంలో

మాంసం తెచ్చి ఆశ్రమవృక్షానికి మూటవేలాడగట్టి వెడుతున్నాడు. మునిపత్ని ఆ మూటను తెచ్చి

కొడుకులకు పెట్టి తామ తింటోంది. సుఖంగా కాలం గడుస్తోంది.

అరుణమహారాజు పుత్రార్థియై తపస్సుకు వెళ్ళినప్పటినుంచీ రాజ్యాన్నీ రాజధానినీ అంతఃపురాన్నీ

వసిష్ఠులవారే రక్షిస్తున్నారు. సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. అతడికి

వసిష్ఠులవారి మీద కోపం తగ్గలేదు. తనను అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదని ఇతడికి

ఆ కులగురువుమీద కోపం. పెళ్ళిపీటల మీదనుంచి విప్రభార్యను అపహరించాడని వసిష్ఠుడికి

సత్యవ్రతుడిమీద ఆగ్రహం. పెళ్ళి మంత్రాలు నడిచాయే తప్ప, సప్తపది ముగియకుండానే అపహరించాను

కనక ఇది విప్రకన్యాపహరణమే కానీ విప్రభార్యాపహరణం కాదనీ అనవసరంగా నాకు పెద్ద శిక్ష

విధించారనీ ధర్మసూక్ష్మాలు అన్నీ తెలిసిన వసిష్ఠుడే దీనికి ప్రేరకుడనీ సత్యవ్రతుడి అభిప్రాయం.

త్యాజ్యమానం వనే పిత్రా ధర్మిష్ఠం చ ప్రియం సుతమ్ ।

న వారయామాస మునిర్వసిష్ఠః కారణేన హ॥

పాణిగ్రహణమంత్రాణాం నిష్ణా స్యాత్సప్తమే పదే |

జానన్నపి స ధర్మాత్మా విప్రదారపరిగ్రహే ॥

కామెంట్‌లు లేవు: