26, నవంబర్ 2023, ఆదివారం

 *ప్రశ్న : కార్తిక మాసంలో ఎలాంటి వ్రతం చేస్తే మంచిది. ఏ ఏ నియమాలు పాటించాలి?*


జ : కార్తికంలో స్నానం,జపం,దానం పారాయణ ఏదైనా మహోన్నత ఫలాన్నిస్తుంది. ఎవరికి వీలైన వ్రతాన్ని వారు పాటించవచ్చు. ముఖ్యంగా దీపదానానికి సమానమైన దానం లేదు.

అవ్రతః కార్తికో యేషాం

గతో మూఢధియా మిహ l

తేషాం పుణ్యస్యలేశోపి

న భవేత్.....

" కార్తిక మాసంలో ఏ వ్రతమూ చేయకుండా గడిపే మూఢులకు పుణ్యం లేశమైనా లభించదు. అట్టివారి జన్మ నీచజన్తు జన్మకు సమానమని ధర్మశాస్త్రం కొంచెం గట్టిగానే ఘాటుగానే చెప్పింది.

కార్తిక మాసంలో రామాయణ, సుందరకాండాది పురాణాలను పారాయణం ప్రారంభించి, మాసాంతంలోగా పూర్తి చేయడం కూడా ధర్మశాస్త్రాలు విధించాయి. ఉత్తముడైన పండితుని ద్వారా ఈ మాసం దివ్య పురాణాలను శ్రవణం చేయడం గొప్ప ఫలితాన్నిస్తుందని పురాణవచనం. తాంబూలం, కేశఖండనం వంటివి విసర్జించడం ఉత్తమం. ఆకాశదీపాన్ని విష్ణు ప్రీతికై ఏర్పాటు చేస్తారు కొందరు. కార్తికంలో ఉల్లి, ఇంగువ,పుట్టుకొక్కు,గంజాయి,ముల్లంగి, ఆనపకాయ, మునగ కాడలు, వంగకాయ, గుమ్మడికాయ, వాకుడు,పుచ్చకాయ, వెలగపండు,నూనె, లవణశాకం,చద్ది మొదలైనవీ రెండు మార్లు వండిన అన్నం, మాడిన అన్నం,మినుములు, పెసలు,సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ద్విదళ ధాన్యాలువాడరాదు. సప్తమి నాడు - ఉసిరిక,తిలలు,

అష్టమినాడు - కొబ్బరి, ఆదివారం - ఉసిరికపప్పు కార్తికంలోనే కాక ఏ మాసమందూ ఉపయోగించరాదు.

కామెంట్‌లు లేవు: