🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 11*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*11. మానకంజార నాయనారు*
కంజారు అనే గ్రామంలో మానకంజారుడు అనే భక్తుడు నివసిస్తూ
ఉండేవాడు. వేలాల కులంలో జన్మించిన అతడు రాజుగారి సైన్యానికి
దళపతిగా ఉండేవాడు. శివుని మీద అచంచలభక్తి విశ్వాసాలను కలిగిన
మానకంజారుడు తన సంపదలన్నీ శివభక్తులకు చెందినవేనని భావించి
వారు కోరకనే వారికి కావలసినవన్నీ ఇస్తుండేవాడు.
పరమేశ్వరుని
నియమనిష్ఠలతో పూజిస్తూ వచ్చిన అతనికి ఒక కుమార్తె జన్మించింది.
అల్లారుముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి కొంతకాలానికి యుక్తవయసుకు
చేరుకుంది. మాన కంజారు తన కుమార్తెను ఎయర్ కోన్ కలిక్కామరుకు
ఇచ్చి పెళ్లిచేయడానికి నిశ్చయించాడు.
కంజారు గ్రామం పెళ్లి సంబరాలతో కల కలలాడింది.
ఎయిర్కోన్నాయనారు, అతని బంధువులు మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా
మానకంజారు పెళ్లి ఇంటికి బయలుదేరారు. వారు రావడానికి పూర్వమే
ఒక మునివరుని వేషాన్ని ధరించి పరమేశ్వరుడు కంజారు ఇంటిలో
అడుగుపెట్టాడు. కంజారు తన కుమార్తెను పిలిచి ఆ మునివరుని పాదాలకు
నమస్కరింపజేశాడు.
తన పాదాలకు నమస్కరించిన పెళ్లికుమార్తె తల
వెండ్రుకలను మునీశ్వరుడు చూశాడు. కంజారుతో "మీ అమ్మాయి తల
వెండ్రుకలు నాకు జంద్యానికి ఉపకరిస్తాయి" అన్నాడు. వెంటనే పొడవుగా
వేలాడుతున్న తన కుమార్తె తల వెండ్రుకలను మొదలంట కత్తరించాడు.
కంజారనాయనారు. దానిని మునివరుని చేతిలో పెట్టడానికి ముందుకు
రాగా మునివరుడు మాయమయ్యాడు. ఉమాదేవి సహితుడై
వృషభవాహనారూఢుడై పరమేశ్వరుడు గగనవీధిలో ప్రత్యక్షమయ్యాడు.
"భక్తుడా! నీభక్తి లోకానికి తెలియజేయడం కోసమే నేను ఇలాచేశాను” అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో పెళ్లి కుమార్తె
తలవెండ్రుకలు యథాప్రకారం వచ్చాయి.
*పదకొండవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి