అగ్నౌ దగ్ధం జలే మగ్నం హృతం తస్కరపార్థివైః l
తత్సర్వం దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతే ll
- సుభాషితరత్నభాణ్డాగారము
ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి పోవడము గానీ, నీటిలోబడి మునిగి పోవడము గానీ లేక చోరులచేత తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న దానిని గూర్చి పరితపించక కృష్ణార్పణం అన్న దృష్టిని అలవరచుకొంటే అంతకు మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా . కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ సంతృప్తి వస్తుంది. ఆవిధంగా మనము వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ ఉండరని మాత్రం అనుకోవద్దు. ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు. వారలే మనకాదర్శము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి