అగ్నిని ధ్యాన శ్లోకంలో యిలా వివరణ కలదు. అగ్నయే రుద్ర రూపాయ అని. మరి అగ్ని పుట్టుక మూలం ఎక్కడ పరిశీలన. సూర్యుడు లేక భూమి సమస్త శూన్యము లేక సమస్త విశ్వ వ్యాపితయైన అగ్ని తత్వం ఏమిటి. దీనినే రుద్ర శబ్దము. అయితే మనకు కనపడే రుద్రునకు అంత అనంత విశ్వవ్యాప్తం ఎలా దానికి మూల కారకుడు ఆయనే కనుక. దాని పరమాణం ఏమిటి ఎలా కొలుచుట వక వేళ అది పదార్ధమును ఆశ్రయించి యున్నదా. అట్లయిన అది పదార్ధమునకు ఎలా సంభవించినది. అగ్ని మనం తయారు చేయుటా లేక తయారు చేసినది మనం ఉపయెూగించుటా. రాహువు యెుక్క మూల మాగ్నెట్ శక్తి మనం చూడలేదు. దానికి వక ఎన్టీ క్లాక్ వైజ్ లో విశ్వంలో తిరిగే అనంతమైన శక్తి అది పదార్ధం కాదు. కాని దాని చైతన్యమై బిగ్బాంగ్ సూత్ర ప్రకారం ప్రచోదయాత్.చైతన్యమైనది అనగా ప్రచోదనమైనది. అనగా చైతన్యము. అది మనకు తెలుపుటకు వేదం రుద్ర రూప ఆరుద్ర అనే నక్షత్ర రూపం నిర్ణయించి దాని స్ధానం భూమి మధ్య రేఖయైన కర్కాటకరేఖనుండి అనగా మేషరాశి మధ్యలో 67డిగ్రీలనుండి కర్కాటకరాశినుండి 13 డిగ్రీల మధ్యలో శక్తిని నిర్మించిరి. అదియే చైతన్యమై లక్షణము గల కేతువుగాను మూల నక్షత్ర శక్తిగా నిర్ణయించిరి. కనుక రుద్ర శక్తియే రాహువుగాను దాని వ్యాప్తంగా విశ్వ వ్యాప్తియైనది. రుద్రుని మరో పేరు వైశ్వానరుడు అనగా అగ్ని వైశ్వానరుడు. వైశ్వ దేవమనే అగ్ని చైతన్య ప్రక్రియ వేద పరంగా కలదు. జగత్తుకు ఆయనే మూల కారకుడు. సాక్షాత్ ఈశ్వర తత్వము వైశ్వానరుడు అది లీలగా మాత్రమే కనబడును. అనగా లాలీలాయ జ్వాలలు మాత్రమే. అదియే కేతు రూపమైన విషు విష్ణు తత్వ మని అదే కారణమని అందుకే అగ్ని సూర్యోదయం తరువాతనే ప్రజ్వలింప చేయవలెను. అనగా సప్త కిరణ చైతన్యము ఉష కాంతి యే రుద్ర స్వరూపం. దానిని మేషో లసత్ కేతవే అని అశ్వనీ నక్షత్ర మంత్రం గాయత్రీ ప్రారంభం అగ్నితో కలదు. క్రవ్యాది సమస్త పదార్థములు చైతన్య లక్షణమే అగ్నిని అనగా కర్రలను మంత్ర పూర్వక చైతన్యమే అగ్ని యెక్క లక్షణము. అదే హవనపూర్వకమైన హవిస్సు అగ్నికి మరో రూపం. అటువంటి అగ్నియే జీవ సృష్టికి మూలమని తెలియును. యిక్కడ వక శ్లోకం చూసిన అగ్నయే రుద్రరూపాయ నమెూవైశ్వానరాయచ సర్వసంహార రూపాయ జగజ్జీవనమూర్తయే - తస్మై తుభ్యమహంనతో. అగ్ని సకల వ్యాప్తియైనది సప్తార్చ్షితే - సాక్షాత్ ఈశ్వర మూర్తిన్ భేద వపుషే మేషోలసత్ కేతవే. నైవస్యాత్ తక్షణం అప్య శేషభువనం హవ్యాదకవ్యాసన - క్రవ్యాదాది చరాచరాత్మకం యిదం యస్మాద్ పరస్మాద్వృతే అని అగ్ని యెక్క వివరణ. హవనాగ్నియే సృష్టికి మూలమని అది నిత్యం వక యింటిలో నైనా నుండవలెనని అట్లు వుండుట వలన ప్రకృతిలో పరిమిత ప్రాంతంలో విషవాయువులు దహింప బడి వాతావరణ స్వచ్ఛత కలుగును.
***********************
***********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి