18, ఆగస్టు 2020, మంగళవారం

పోత‌న త‌లపులో ...(23)

ఒక్క‌డే ప‌ర‌మ‌పురుషుడు
విశ్వాధీశుడొక్క‌డే
అనంత‌కోటి స్వ‌రూపమొక్క‌టే
అంటూ స‌ర్వాంత‌ర్యామి త‌త్వాన్ని
తేట‌తెల్లం చేసే ప‌ద్యం.

                       ***
పరమపూరుషుఁ, డొక్కఁ, డాఢ్యుఁడు, పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు; ముకుంద, పద్మజ, శూలి సంజ్ఞలఁ బ్రాకృత
స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు; నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.
                      ***

పరమపురుషుడు ఒక్కడే; ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు; ఆయనే సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తు, రక్షిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు; అందులో అనంత సత్త్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు.

🏵️మ‌ధురం మ‌ధురం 🏵️
   🏵️పోత‌న ప‌ద్యం 🏵️
*********************

కామెంట్‌లు లేవు: