#బ్రాహ్మణులచరిత్ర - #బ్రాహ్మణగోత్రపురుషులు :
#బ్రాహ్మణులలోశాఖలు - #వైదికులు #మరియు #నియెాగులు (ప్రధమ భాగము)...
కొద్దిరోజుల క్రితం "మహామంత్రి తిమ్మరుసు చరిత్ర" పై నేను పెట్టిన టపా పై స్పందించిన ముఖపుస్తక మిత్రులు 'జానీ యాదవ్ గారు' - "బ్రాహ్మణులలోని వైదిక మరియు నియెాగి శాఖల తేడా ఏమిటని, సవివరంగా తెలియజేయమని" అడిగారు. దీనిపై 'బ్రాహ్మణుల చ
#బ్రాహ్మణులచరిత్ర - #బ్రాహ్మణగోత్రపురుషులు :
#బ్రాహ్మణులలోశాఖలు - #వైదికులు #మరియు #నియెాగులు (ప్రధమ భాగము)...
కొద్దిరోజుల క్రితం "మహామంత్రి తిమ్మరుసు చరిత్ర" పై నేను పెట్టిన టపా పై స్పందించిన ముఖపుస్తక మిత్రులు 'జానీ యాదవ్ గారు' - "బ్రాహ్మణులలోని వైదిక మరియు నియెాగి శాఖల తేడా ఏమిటని, సవివరంగా తెలియజేయమని" అడిగారు. దీనిపై 'బ్రాహ్మణుల చరిత్ర వారిలోని విభిన్న శాఖలకు' సంబంధించి నేను పరిశోధించి సేకరించిన సమాచారాన్ని సవివరంగా కొంత ఇక్కడ చర్చిస్తాను.
పరాత్పరుడైన 'పరమేశ్వరుని' ముఖమునుండి ఆయన యెుక్క ఉఛ్వాశనిశ్వాసములుగా వెలువడినదే సృష్ట్యాదిలో ఒక్కటే ఐన "వేదరాశి". "వేదాలే" మన భారతీయ సంస్కృతికి మూలస్థంభం. ఈ వేదములే ప్రమాణముగా తీసుకొని, అవి బోధించే విధముగా జీవించే ప్రజల సంస్కృతినే "సనాతన ధర్మం" అంటున్నాం. సనాతన భారతీయ సంస్కృతి మరియు వైదికధర్మ స్థాపకులైన "#సప్తబుషులకు" 'వేదదర్శనం' అయిందని మనకు వైదిక సాహిత్యం మరియు బౌద్ధసాహిత్యం స్పష్టం చేస్తున్నాయి. 'అపౌరుషేయమైన' కాలనిర్ణయం చేయలేని ఈ అపార 'ఏకైక వేదరాశి' తదనంతర కాలములో బుక్, యజు, సామ మరియు అధర్వ భాగములుగా విభజించబడినది. ఇటువంటి అతిప్రాచీన బుషిధర్మమైన ఆర్షసంస్కృతినీ, వేదధర్మాన్ని మనసావాచాకర్మణా త్రికరణశుధ్ధిగా ఆచరిస్తూ, శాస్త్రప్రమాణాన్ని నిత్యజీవితంలో అనుసరిస్తూ, వేదవిహితమైన కర్మలనే ఉఛ్ఛాశ్వ నిశ్వాసములుగా జీవిస్తూ, 'బుషుల ఆదర్శాన్ని' సమాజంలో స్థాపించి, వైదిక సంస్కృతీ సంప్రదాయములను రక్షిస్తూ భారతదేశపు నలుమూలలా వ్యాపింపజేసిన వేదయుగపు ఆర్యబుషుల సంతతివారే #బ్రాహ్మణులు.
#బ్రాహ్మణులఆవిర్భావం....
అతిప్రాచీనమైన "బుగ్వేదం" లో సుప్రసిద్ధమైన పురుషసూక్తం దశమ మండలం (10.90.12) లోని శ్లోకం : -
"బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత ||"
ఇదే, 'తైత్తరీయారణ్యకమ్ - తృతీయప్రశ్న - 5' లో కూడా ఉన్నది. దీని అర్ధం "సహస్ర శీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సర్వవ్యాపకుడు ఐన మహాపురుషుని ముఖమే 'బ్రాహ్మణుడు' అని అర్ధం. అనగా, 'బ్రాహ్మణుని జన్మ' ఆ విశ్వవ్యాపకుడైన విరాట్ పురుషుని వాక్కుకు కేంద్రమైన నోటి నుండి జరిగిందని అర్ధం. మిగిలిన భాగములైన బాహువులు, ఊరువులు, పాదములనుండి వరుసగా రాజన్యులు (క్షత్రియులు), వైశ్యులు, శూద్రులు ఉధ్భవించారని" పురుషసూక్తం స్పష్టం చేస్తున్నది. 'భారతీయ సంస్కృతి' వ్యాప్తికి మూలపురుషులైన 'ఆర్యులు' ఉత్తరాదినుండి దక్షిణాదికి వ్యాపిస్తూ స్థానిక ప్రాంతీయ అనార్య తెగలను తమలో లీనం చేసుకుంటున్న క్రమంలో, ఈ "చాతుర్వర్ణ వ్యవస్థ" రూపొందిందని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం.
మనుస్మృతి 'బ్రాహ్మణుల విధుల' గురించి ఈ విధముగా చెప్పుచున్నది : -
"అధ్యాపన మధ్యయనం యజనం యాజనం తధా
దానం ప్రతాగ్రహశ్చైవ షట్కర్యాణ్యగ్రజన్మనః"
అనగా, "తను చదువుకుంటూ ఉండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలను చేయించడం, దానాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి బ్రాహ్మణుల విధివిధానాలని" అర్ధం.
"బ్రహ్మన్" అనే సంస్కృత శబ్దం నుండి 'బ్రాహ్మణ' అనే మాట పుట్టింది. 'బృహ్' అనే ధాతువు నుండి 'బ్రహ్మన్' ఏర్పడినది. 'బృహ్' అనగా 'వ్యాపించే లక్షణం కలది' అని అర్ధం. 'బ్రహ్మన్' అనే పదానికి 'విశ్వశక్తి, యజ్ఞము' అనే అర్ధాలున్నవి. 'బ్రహ్మ' అంటే 'వేదం, జ్ఞానము'. ఈ 'బ్రహ్మ' శబ్దానికి 'అణ్' ప్రత్యయం చేర్చడంతో 'బ్రాహ్మణ' శబ్దం వచ్చిందనీ "బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" వివరణ. అనగా వేదాధ్యయనం, యజ్ఞము చేయువారు, ఆత్మజ్ఞానము తెలిసిన వారు 'బ్రాహ్మణులు' అని అర్ధం చేసుకోవచ్చు.
ఈ అర్ధంలోనే 'జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు',
"జన్మనా జాయతే శూద్రః సంస్కారా ద్ద్విజ ఉచ్చతే
వేదపాఠీ భవే ద్విప్రః బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః"
అని నుడివారు...
అనగా, పుట్టుకతో అందరూ 'శూద్రులే' అయినా, తమతమ విధినిర్వహణ సంస్కారాలను బట్టి 'ద్విజులు' గానూ, వేదపాఠాలను చదవడం వల్ల
'విప్రులు' గానూ, బ్రహ్మజ్ఞానము పొందడం వల్ల 'బ్రాహ్మణులు' గానూ అవుతారని శంకరులు వివరించారు.
#బ్రాహ్మణులలోతరగతులు...
బ్రాహ్మణవంశం లో పుట్టినంత మాత్రాన అందరూ బ్రాహ్మణులు కాలేరని అంటారు. తదనుగుణమైన సంస్కారాలను బట్టి బ్రాహ్మణులలో ఈ క్రింది 'విభజన' (తరగతులు / స్థాయిలు) ఉన్నవి.
ఉపనయనాది సంస్కారాలు, వైదికకర్మలు లేని వారు 'మాత్రులు', వైదికాచారాలు పాటిస్తూ శాంతస్వభావులైన వారు 'బ్రాహ్మణులు', బ్రాహ్మణోచితమైన సత్కర్మలు ఆచరించేవారు 'శ్రోత్రియులు', నాల్గు వేదాలనూ అధ్యయనం చేసిన వారు 'అనూచానులు', ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకున్న వారు 'భ్రూణులు', ఎప్పుడూ అరణ్యాలలో, ఆశ్రమాలలో ఉండేవారు 'బుషికల్పులు', రేతస్కలనం లేక నియమితాహారులై సత్యప్రజ్ఞులైన వారు 'బుషులు', కామక్రోధాలకు అతీతులై, నిరతమైన సత్యనిష్ఠ తపోనిష్ఠ కలిగి సంపూర్ణ తత్వదర్శనులైన వారు 'మునులు'...
#బుషులు - #గోత్రపురుషులు
(గోత్రం, ప్రవర, సూత్ర, వేదశాఖ వ్యవస్థ)....
"బ్రాహ్మణులు" తమ మూలాన్ని వారి వంశమూలపురుషులైన 'సప్తబుషుల' పరంగానే చెప్తారు. ఆ బుషిమూలమే 'గోత్రవ్యవస్థ'. ఏ ఏ మహాత్ములు ఏ బుషియెుక్క వంశంలో పుట్టారో ఆ మహాత్ముల స్మరణే "గోత్రం" అని అనవచ్చు.
'గౌః' అనే సంస్కృతపదం నుండి 'గోత్రం' అనే పదం ఆవిర్భవించింది. 'గౌః' అనగా 'గోవులు, ఆవులు' అని అర్ధం. 'గోత్ర' అనే సంస్కృత పదానికి 1. భూమి 2. గోవుల సమూహం అని రెండు అర్ధాలున్నవి. ప్రాచీన ఆర్యజనుల, బుషుల ప్రధానమైన సంపద ఇవే. బుగ్వేద సమాజంలో ఒక్కొక్క గోవుల సమూహానికి (గుంపుకు) ఒక్కో 'బుషి నాయకత్వం వహించేవారు. ఫలానా సమూహం లేదా గుంపు (మంద) కు నాయకత్వం వహించే 'బుషిప్రముఖుడిని' #గోత్రపురుషుడు అంటారు. ఇలా ఒక సమూహానికి (లేదా) గోత్రానికి అధినాయకత్వం వహించేవారిని #గోత్రపతులు అనేవారు. ఒక గుంపులోని
'సగోత్రీకులనీ', వారంతా సంబంధీకులనీ (నేటి జన్యుశాస్త్రపరంగా రక్తసంబంధీకులు), ఈ సగోత్రీకుల మధ్య వివాహం నిషిధ్ధమనే నిబంధన కాలక్రమంలో ఏర్పడినది. 'బ్రాహ్మణులకు గోత్రాలు' వారి మూలపురుషులైన బుషుల పేరుమీదే ఉంటాయి. వాటినే #బుషిగోత్రాలు అంటారు. వేదమతం వ్యాపించే క్రమంలో తదనంతరం ఈ వ్యవస్థ మిగిలిన వర్ణాల వారికీ అమలులోనికి వచ్చింది.
#గోత్రం : ఒక వంశమునకు మూలపురుషునికి చెందినది 'గోత్రం'. 'వంశక్రమం' లో ఒక మహర్షిసంతతి కి చెందిన వారందరూ, ఆయన పేరుగల గోత్రమునకు చెందుతారు. ప్రాచీన ఆర్యులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తదితర విభాగములుగా విడివడ్డారు. వేర్వేరు బుషుల సంతతిగా ఉన్న బ్రాహ్మణులు తమను విభిన్న వర్గములుగా విభజించుకొనుటకు 'గోత్రవిధానం' అమలులోనికి తెచ్చారు. సప్తర్షులైన అంగీరసుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భృగుమహర్షి, వశిష్టుడు మరియు భరద్వాజ మహర్షి లాంటి వారినుండి బ్రాహ్మణుల గోత్రములు ఏర్పడ్డాయి.
#ప్రవర : 'ప్రవర' అనగా ఒక ప్రత్యేక గోత్రానికి చెందిన బుషుల సంఖ్య అని అర్ధం. ఇది ఒక వంశస్తునితో సంబంధము కల్గియున్న ఇద్దరు లేదా ముగ్గురు లేదా నల్గురు లేదా ఐదుగురు సప్తబుషులతో గల సంబంధమును తెలియజేయును. ఇవి రెండు రకములు 1. శిష్య - ప్రశిష్య - బుషి - పరంపర 2. ఉత్తర పరంపర. 'గోత్రప్రవర' లో ఏక బుషేయ, ద్విబుషేయ, త్రిబుషేయ, పంచబుషేయ, సప్తబుషేయ ఇలా 19 మంది బుషుల వరకూ ఈ వరుస కొనసాగుతుంది.
#సూత్రం : క్రీ.పూ. 1000 - 2000 సం||ల మధ్య (అనగా 10 శతాబ్దాల కాలప్రమాణములో) "బ్రాహ్మణులు" అనేక శాఖలుగా చీలిపోయారు. వీరు విభిన్న 'వేదాలను' అనుసరిస్తూ, ఆ వేదాలకు (శృతులకు) విభిన్నమైన భాష్యాలు (వ్యాఖ్యానాలు) వెలయిస్తూ వేరువేరు 'సంప్రదాయ శాఖలను' సృష్టించి వాటికి ఆద్యులైనారు. కొందరు బ్రాహ్మణ పండితులు ఒకే వేదానికి విభిన్నమైన భాష్యములను చెప్పసాగారు. ఈ విభిన్న భాష్యాలనే 'సూత్రములు' అంటారు. ఇవి అపౌరుషేరములైన శృతులపై (వేదములపై) ఆధారపడినప్పటికీ, మానవులచే తయారుచేయబడటం చేత వీటిని 'స్మృతులు' అని పిలుస్తారు. అనగా 'గుర్తు తెచ్చుకొనబడినవి' అని అర్ధము. 21 మంది బుషులు ధర్మశాస్త్రములను రూపొందించారు. వాటిలో 'ఆపస్తంభ, బోధాయన, గౌతమ మరియు వశిష్ట సూత్రములు' అతి ప్రాచీనమైనవని తెలుస్తున్నది.
#బ్రాహ్మణులుపాటించువేదములు :
వివిధ గోత్రములకు చెందిన బ్రాహ్మణులు మరియు వారు పాటించు వేదములను చూద్దాం.
#వేదం : #గోత్రం : -
(1)బుగ్వేదము : భార్గవ, శానికృత, గర్గ, భృగు, శౌనక
(2) సామవేదము : కాశ్యపస, కశ్యపస, వత్స, శాండిల, ధనుంజయ
(3) యజుర్వేదము: భరద్వాజ, భారద్వాజ, అంగీరస, గౌతమ, ఉపమన్యు
(4) అధర్వణవేదము : కౌశిక, ఘృత కౌశిక, మృద్గల, గాలవ, వశిష్ట
#సప్తర్షులు : #ఆవిర్భావగోత్రములు.....
1. "భృగుమహర్షి" నుండి 'వత్స, బీద, ఆరిక్సికసేన, యస్క, మైత్రేయ, శౌనక, వైన్య' గోత్రములు ఉధ్భవించెను.
2. "అంగీరస మహర్షి" నుండి 'గౌతమ, భారద్వాజ, కేవర అంగిరస' గోత్రములు ఉధ్భవించెను.
3. "అత్రిమహర్షి" నుండి 'ఆత్రేయ, బధ్భూతక, గరిస్థిర, మృద్గల' గోత్రములు ఉధ్భవించెను.
4. "విశ్వామిత్రమహర్షి" నుండి 'కౌశిక, లోహిత, శౌక్షక, కంకాయన, అజ, కాతవ, ధనుంజయ, అజమర్కన, పురుణ, ఇంద్రకౌశిక' గోత్రములు ఉధ్భవించెను.
5. "కశ్యపమహర్షి" నుండి 'కశ్యప, విద్రుబ, శాండిల,రేభ, లంగాక్షి' గోత్రములు ఉధ్భవించెను.
6. "వశిష్ట మహర్షి" నుండి 'వశిష్ట, కుండిని, ఉపమన్యు, పరాశర, జతుకారణేయ' గోత్రములు ఉధ్భవించెను.
7. "అగస్త్య మహర్షి" నుండి 'సోమబహార, ఇధమబహార, శాంఖబహార, యజ్ఞభర' గోత్రములు ఉధ్భవించెను.
పైన పేర్కొనబడిన గోత్రాలలో ఒక్కొక్క గోత్రము వారు ఒక్కొక్క వేదాన్ని పాటిస్తారు.
#బ్రాహ్మణులువివిధశాఖలు....
వేదంలో పేర్కొన్న 'భరతవర్షం, భరత ఖండం' అనే అఖండభారతంలో పలుచోట్ల (నేటి భారతదేశానికి బయటి సరిహద్దులలో కూడా) ఆర్యబుషిసంతతి వారైన బ్రాహ్మణులు వ్యాపించి ఉన్నారని తెలుస్తుంది. వేదకాలంలో చారిత్రక యుగాలలో బ్రాహ్మణులు ఉత్తర భారతదేశంలో మాత్రమే జీవిస్తుండేవారు. వేదాలలో ప్రముఖంగా పేర్కొనబడిన "సరస్వతీ నది" తీరంలో బ్రాహ్మణులు నివసిస్తుండేవారు (ఇప్పుడు సరస్వతీ నది అంతర్వాహిని). అయితే, క్రీ.పూ. 300 వ సం||లో సరస్వతి నది ఎండిపోవుట వలన బ్రాహ్మణులు ఉత్తర భారత దేశం నుండి నదీప్రాంతాలు పుష్కలంగా కల దక్షిణ భారతదేశము వైపు వచ్చారు. ఆనాటి బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైన "అగస్త్య మహర్షి" తో సహా బ్రాహ్మణులంతా ఉత్తరాది నుండి వింధ్యపర్వతములు దాటి దక్షిణభారతదేశములోకి ప్రవేశించారు. మిగిలిన బ్రాహ్మణులు తూర్పు, పశ్చిమ దిక్కులకు వెళ్ళారు.
12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీరదేశ పండితుడైన కల్హనుడు 'రాజతరంగిణి' లో ఇలా ఉంది.
"కర్ణాటకాశ్చ తైలంగా ద్రావిడ మహారాష్ట్రకాః
గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడా వింధ్యదక్షిణే
సారస్వతా కన్యాకుబ్జా గౌడా ఉత్కళ మైధిలాః
పంచగౌడా ఇతి ఖ్యాతా వింధ్యస్యోత్తర వాసినః"
దీన్నిబట్టి, 12 వ శతాబ్దకాలంనాటి పూర్వంనుంచే బ్రాహ్మణులు పలుశాఖలుగా విస్తరించి ఉండేవారని తెలుస్తుంది. ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణులను #పంచగౌడీయులు అంటారు. వీరిలో 'సారస్వత, కన్యాకుబ్జ, గౌడ, ఉత్కళ, మైధిలీ' శాఖలు కలవు. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులను #పంచద్రావిడులు అంటారు. వీరిలో 'కర్ణాటక, తైలంగ (తెలుగు), ద్రవిడ, మహారాష్ట్ర, గుర్జరా (గుజరాత్)' అను శాఖలు కలవు. బ్రాహ్మణులు విదేశాలకు సైతం విస్తరించి రాజ్యాలు సైతం స్థాపించారు.
భారతదేశములోని బ్రాహ్మణులనుసరించునది వైదికధర్మము. ఐతే తదనంతరం అవైదికాలైన "జైన, బౌద్ధ, చార్వాకాది" నాస్తికమతములు వేదధర్మాలను ప్రశ్నించాయి. ఈ సందర్భంలో వేదధర్మాన్ని పటిష్టం చేయుటకు, వేదప్రతిపాదనముననుసరించి పౌరాణికయుగాలలో "శైవం, వైష్ణవం, శాక్తేయం" అను విభిన్న మతసంప్రదాయములు, శాఖాబేధములు తలెత్తాయి. నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణవంశములలో శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు తదనంతరం మల్లికార్జున పండితారాధ్యుడు, నీలకంఠ శివాచార్యుడు, అప్పయదీక్షితులు మెు||గు వేదాంతప్రవక్తలు, భాష్యకారులు ఉధ్భవించి ప్రజలందరినీ వేదమార్గంలోకి తెచ్చారు.
ముఖ్యంగా దక్షిణాది బ్రాహ్మణులలో వారు పాటించు #గురుసంప్రదాయము ను బట్టి (శంకర, రామానుజ, మధ్వ), 3 ప్రధానమైన విభాగాలవారుంటారు.
1. స్మార్తులు (శంకర మతం) 2. శ్రీవైష్ణవులు (రామానుజ మతం) 3. మధ్వులు (మధ్వ మతం)
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో అధికంగా ఉన్నవారు 'స్మార్తులు'. శ్రీవైష్ణవువులు, మధ్వవైష్ణవులు ఉన్నప్పటికీ స్మార్తులతో పోల్చుకుంటే వారి సంఖ్య స్వల్పం (ఈ సంగతులన్నీ ప్రత్యేకంగా వేరేటపాలో చర్చిస్తాను).
#ఆంధ్రబ్రాహ్మణులు (తెలుగు బ్రాహ్మణులు) : - -
'శ్రుతి' అనగా 'వేదం', 'స్మృతి' అనగా 'ఉపనిషత్తులు'. వీటిని అనుకరించేవారిని 'స్మార్తులు' అంటారు. ఆంధ్రబ్రాహ్మణులలో అధిక సంఖ్యాకులు స్మార్తులు. వీరు శంకరాచార్యులవారినీ, శృతులనూ మరియు స్మృతులనూ అనుసరిస్తారు. గోదావరీ తీరములో క్రీ.పూ. 6 వ శతాబ్దంలో నివశించిన ఆపస్తంభుడు రచించిన 'ఆపస్తంభ సూత్రాలను' స్మార్త బ్రాహ్మణులు అనుసరిస్తారు.
'ఆంధ్రస్మార్తబ్రాహ్మణులు' ముఖ్యంగా 'వైదిక మరియు నియెాగి' అనే రెండు తెగలుగా విభజింపబడినారు.
(1) వైదికులు (2) నియెాగులు
(1) #వైదికులు : - 'వేదం తెలిసిన వారు వైదికులు' అనునది ప్రాధమికంగా అందరికీ తెలిసిన అంశం. వంశపారంపర్యంగా వస్తున్న వేదవేదాంగ విహితమైన పురోహిత కార్యక్రమాలను (పౌరోహిత్యం) నిర్వహిస్తూ, సమాజంలో జనులందరూ తమతమ జన్మానుసారం చేయదగిన సంస్కారనిర్వహణకు మంత్రసహితమైన కర్మకాండలతో తోడ్పడుతూ ప్రజాసేవకు, దైవసేవకూ అంకితమైన వారు వైదికులు. వేదవిద్యాభ్యాసం, వేదప్రచారం, వేదవిదితమైన మంత్రోక్తమైన యజ్ఞయాగాదుల నిర్వహణ, దేవాలయ విధుల నిర్వహణ మెు||న వేదం విధించిన విధులను నిర్వహిస్తూ, శాస్త్రానుసారంగా తు.చ. తప్పకుండ జీవించేవారే వైదికులు. వీరిలో అత్యధికులు 'కృష్ణయజుర్వేద శాఖకు' చెందినవారే.
"వేదం తెలిసిన వారు వైదికులు" అన్నది నానుడి. మరల ఏ వేదం చదివిన వారు అని ప్రశ్న. వైదికులలో బుగ్వేద, యజుర్వేద, సామవేద పాఠకులు అందరూ ఉన్నారు. ఐతే, వీరంతా 'ఏకవేదపాఠకులే' (అనగా ఒక వేదాన్ని, దాని సంబంధిత అంశాలనూ పఠించేవారే). అంతేగాక 'ద్వివేదులు' (రెండు వేదాలలో నిపుణుడు), 'త్రివేదులు' (మూడు వేదాలలో నిష్ణాతుడు), 'చతుర్వేది' (నాలుగు వేదాలలో నిష్ణాతులు) సైతం కన్పిస్తున్నారు. కాలక్రమంలో ఇవే వారి 'ఇంటిపేర్లు' గా కూడా మారినవి.
'తెలుగు స్మార్త బ్రాహ్మణులలో' ప్రాంతాలను బట్టి నేడు కన్పిస్తున్న అనేక తెగలు : - - తెలగాణ్యులు (నైజాం), మురికి (ముల్కి) నాడు, వెలనాడు (శుధ్ధ, కాకిమాని, పెరుంబటి), కాసల (కోసల) నాడు, కరణకమ్మలు (బాల కరణాటి, కొలింగేటి, ఓగేటి), వేగినాడు, తొండ్రనాడు (తిరుపతి), ఔదమనాడు, కోనసముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు (తూర్పు, కోస్తా, కోనసీమ, పేరూరు), తుంబల వారు, ప్రధమ శాఖీయులు మెు||న తెగల వారు కలరు.
నేటి వర్తమాన ఆర్ధిక పరిస్థితులను బట్టి వైదికులు అనేక పదవులు, ఉద్యోగాలలోనూ, ఇతర వృత్తివిద్యలలోనూ, విభిన్నరంగాలలోనూ ప్రవేశించి రాణిస్తున్నారు.
(2) #నియెాగులు : - వైదికుల నుండి విడిపోయి, ఒక ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు నియెాగులు. ఇది ఒక విస్తృతమైన శాఖ.
ఆదిలో వేదశాఖలతో సంబంధించిన వేదసామ్రాజ్యసంప్రదాయాన్ని అనుసరించే విప్రులనే 'బ్రాహ్మణులుగా' పరిగణించేవారు. నిరంతర వేదఘోషతో అలరారే 'అగ్రహారాలే' వీరి నివాసభూములు. వీరే 'శుద్ధవైదిక బ్రాహ్మణులు'. ఐతే, తదనంతర కాలంలో వైదిక బ్రాహ్మణులనుండి కొన్ని శాఖలు 'వేదాధ్యయనానికి' దూరంగా జరిగి రాజాస్థానములయందు, రాజులను ఆశ్రయించి లౌకిక వృత్తులను నిర్వహించడానికి వినియెాగించబడినాయి. ఈ విధంగా 'మంత్రి, కరణీకం' లాంటి లౌకిక ప్రజోపయెాగమైన బాధ్యతలను నిర్వహించే సామర్ధ్యం గల 'బ్రాహ్మణులను' రాజాధిరాజులు తమ ఆస్థానాలలో 'వినియెాగించిన' కారణం చేత వీరు 'నియెాగులు' అయ్యారు. వీరు వ్యాపార దక్షుల గానూ, రాజులవద్ద అమాత్యులగానూ, సంస్థానాలలో కరణాలు గానూ నియుక్తులై వినియెాగింపబడేవారు. వీరే తదనంతర కాలంలో 'అమాత్య, ప్రగడ (ప్రగ్గడ), రాజు' తదితర బిరుదులను వారి గృహనామాలు మరియు పేర్ల చివర చేర్చుకొన్నారు. దీనికి గల కారణం, వీరు లౌకిక వృత్తికోసం రాజులను ఆశ్రయించి 'అమాత్య' పదవి పొందుటయెా (లేక) రాజులకు మారుగా వ్యవహారములు నడిపేవారన్నది స్పష్టం.
లౌకిక వ్యవహారముల రిత్యా ఇలా వైదికుల నుండి విడిపోయి, వేరొక ప్రత్యేక శాఖగా ఏర్పడిన నియెాగులలో మరల అనేకానేక శాఖలున్నవి. అవి
ఆర్వేల (ఆరువేల) నియెాగులు, నందవరీక నియెాగులు, కరణకమ్మ నియెాగులు, వెలనాటి నియెాగులు, తెలగాణ్య నియెాగులు, ద్రావిడ నియెాగులు, కరణాలు, శిష్ట కరణాలు, కాసలనాటి నియెాగులు, పాకలనాటి నియెాగులు, ప్రాంగ్నాటి (ప్రాజ్ఞాడు) నియెాగులు, ప్రధమశాఖ నియెాగులు లాంటి ఇంకా అరుదైన నియెాగి శాఖలు ప్రాంతాలను బట్టి నేడు దర్శనమిస్తున్నాయి. ఈ నియెాగులలో ఎక్కువమంది 'కృష్ణయజుర్వేదాన్నే' అనుసరిస్తారు. ఐతే, మహారాష్ట్రలో అధికంగా ఉండే ప్రధమశాఖ నియెాగులు 'శుక్ల యజుర్వేదాన్ని' అనుసరిస్తారు. ఈ 'ప్రధమ శాఖీయులలో' వాజసనేయులు, శైవులు, యాజ్ఞవల్క్యులు, కణ్వులు తదితర శాఖీయులు సైతం ఉన్నారు.
నిరంతర రాచకార్యాల వత్తిడి వల్ల వీరిలో వేదాధ్యయనానికి తగినంత వీలుచిక్కక, బ్రాహ్మణవంశ సంజాతులైన చాలామంది నియెాగులు వేదదూరులై, వైదిక కార్యక్రమాల పట్ల వారి శ్రధ్ధ కేవలం పర (వివాహ) మరియు అపర (శ్రాధ్ధ) కర్మలకే పరిమితమైపోయినట్లు, అదే నేటికీ కొనసాగుతున్నట్లు 'బ్రాహ్మణుల చరిత్ర' తెలియజేస్తున్నది.
ఇక, భారతదేశముపై వివిధ దండయాత్రలు చేసిన ముసల్మానులు, భారత భూమిపై వారి ఇస్లాం ధర్మవ్యాప్తికి హైందవ రాజులను ఓడించి సంహరించి, తరువాత బ్రాహ్మణులను సైతం సంహరించేవారు. కారణం, వారిని నాశింపజేస్తే సనాతన ధర్మాన్ని నశింపజేయవచ్చని. ఐనప్పటికీ వారు సాధించిన విజయం అత్యల్పం. ఎన్ని పరాయి ధర్మాలు వచ్చినా 'శంకర, రామానుజ, మధ్వ, నింబార్క, చైతన్యదేవుల' వంటి బ్రాహ్మణోత్తములు వేదాంతాచార్యుల కృషి, వారు వేసిన ధార్మిక పునాదుల వల్లనే ఈ భూమిపై 'వేదవేదాంతధర్మం' ఎప్పటికీ నిలచిఉంటుందనేది పరమసత్యం.
అందుకే, ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ధర్మసంరక్షణ సంస్థాపనకై "గోబ్రాహ్మణ సంరక్షణ" రాజుల, పాలకుల కర్తవ్యమని శాస్త్రోక్తి.
"సప్తర్షుల చరిత్ర, అగస్త్య, వశిష్ఠ, కశ్యప, అత్రి"
మెు||న వారి చరిత్రను నా ఈ క్రింది లంకెలలో చూడవచ్చును.
https://m.facebook.com/story.php?story_fbid=793181067782778&id=100012726760631
https://m.facebook.com/story.php?story_fbid=780902412343977&id=100012726760631
https://m.facebook.com/story.php?story_fbid=839290063171878&id=100012726760631
https://m.facebook.com/story.php?story_fbid=903626406738243&id=100012726760631
https://m.facebook.com/story.php?story_fbid=907113329722884&id=100012726760631
******************************************

#పరిశోధనవ్యాసం - #సమగ్రసమాచారసేకరణ.......
#డాక్టర్ #ముళ్ళపూడిరవిచంద్రనాథచౌదరి,
M.Sc. (Tech.), Ph.D....
#శ్రీనరేంద్రనాధసాహిత్యమండలి, #కళాప్రపూర్ణశ్రీముళ్ళపూడితిమ్మరాజుస్మారకగ్రంధాలయంమరియుసాంస్కృతికకేంద్రము, తణుకు - ఉండ్రాజవరం సంస్థానం, పశ్చిమగోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్.....
Mobile (9182978173) &
Whats App (09959002050)..........రిత్ర వారిలోని విభిన్న శాఖలకు' సంబంధించి నేను పరిశోధించి సేకరించిన సమాచారాన్ని సవివరంగా కొంత ఇక్కడ చర్చిస్తాను.

Whats App (09959002050)..........
****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి