రాముడు గొంతు తగ్గించి మృదువుగా .... పరశురామా ! నీ కధలు పెద్దలు చెప్పగా విన్నాను. అమోఘమైన నీ పితృభక్తి ,తండ్రి ఋణము నీవు తీర్చుకున్న విధానము ఇతరులకు సాధ్యముకానిది.
.
నన్ను పరాక్రమం లేనివాని వలే ,క్షత్రియధర్మాచరణ సాధ్యముకాని వలే ,తేజోహీనుని వలే అవమానిస్తున్నావు!
.
నా పరాక్రమము నీకు చూడవలెనున్నదా ! అయితే ఇదిగోచూడు అంటూ పరశురాముని చేతినుండి చాపము ,శరము తీసుకొని విల్లెక్కుపెట్టి శరసంధానము చేసి ,క్రుద్ధుడై !
నీవు బ్రాహ్మణుడవు కావున నీ ప్రాణము తీయను .
.
నేను ఒక్కసారి బాణం సంధిస్తే అది వృధాగా పోరాదు ! నీ పాదగమనశక్తిని కొట్టమంటావా !
.
నీవు తపస్సుచే సంపాదించుకున్న ఉత్తమలోకాలను కొట్టమంటావా ! అని అడిగాడు శ్రీరాముడు!.
.
రాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టగనే పరశురాముడు నిర్వీర్యుడై, జడుడై, నిశ్చేష్టుడాయెను.
.
అప్పుడు పరశురాముడు మెల్లగా రామా !
నా గమన శక్తిని కొట్టవద్దు ,నా తపోలోకములను కొట్టుము
ఇక ఆలస్యము చేయకు అనగా రాముడు అట్లే చేసినాడు!
.
నేను నీ చేతిలో పరాజితుడనయినాను ,అందుకు నేను సిగ్గుపడను అని పలికి రామునిచేతిలో భంగపడినవాడై మహేంద్రగిరికి అతివేగముగా వెళ్ళి పోయినాడు.
.
పరశురాముడు వెళ్ళిన పిదప రాముడు ఆ ధనుస్సును,శరమును వరుణునకు అప్పగించివేశాడు!.
.
తండ్రి వైపు తిరిగి ,తండ్రీ తదుపరి కర్తవ్యాన్ని సెలవివ్వండి ! మీ అధీనంలోని చతురంగబలాలను అయోధ్యవైపు కదలటానికి అనుజ్ఞ ఇవ్వండి అని వినయంగా పలికాడు!
.
ఒక్కసారిగా నడిసంద్రంలో పెనుతుఫాను వెలిసి గండంగడిచిన నావికుడి హృదయంలాగ దశరధుడి మనస్సు తేలిక పడి రాముని తన బాహువులతో కౌగలించుకొని శిరస్సుపై ముద్దిడి ఆనందభరితుడయినాడు.
.
అయోధ్య చేరుకున్నారంతా!
.
కౌసల్యా, సుమిత్ర, కైకేయి కొత్తకోడళ్లకు ఎదురేగి ఆహ్వానంపలికి మంగళకరంగా గృహదేవతలను పూజించి పెద్దలందరి దీవనలు కోడళ్లకు ఇప్పించి ఎన్నో భూరిదానాలు చేశారు.
.
నూతన దంపతులు సుఖంగా కాలం గడపసాగారు.
.
కొంతకాలానికి మేనమామ యుధాజిత్తుతో కలసి భరతుడు ,శత్రుఘ్నునితో కూడి వారి వారి భార్యలను వెంటనిడుకొని కేకయ రాజ్యానికి ప్రయాణ మయినారు.
.
శ్రీరామచంద్రుడు ,లక్ష్మణుడు తండ్రికి సేవచేస్తూ పురజనుల అభిమానాన్ని చూరగొంటున్నారు.
.
సీతారాములు అన్యోన్య ప్రేమతో ఆనందంగా కాలము గడుపుతున్నారు .సీత అంటే రాముడు ,రాముడు అంటే సీత వీరిరువురికీ భేదంలేదు అని లోకం చెప్పుకోనారంభించింది!
.
శ్రీమద్రామయణంలోని బాలకాండ సమాప్తము
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

*******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి