15, అక్టోబర్ 2020, గురువారం

అబ్దుల్‌ కలామ్‌ జయంతి🌷🌷

 🌷🌷ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ జయంతి🌷🌷


ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ) తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు.


కలాం ఎఫెక్ట్’ పుస్తక రచయిత, కలాం పర్సనల్ సెక్రటరీ, PM NAIR అనుభవాలు… ఆయన మాటల్లోనే…


• 2002… కలాం గారు రాష్ట్రపతిగా వున్నరోజులవి… రంజాన్ మాసం… సాంప్రదాయబద్దంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు రాష్ట్రపతి భవన్ సిద్దమవుతుంది. నన్ను కలామ్ పిలిచి ఇలా అడిగారు… “ఈ విందు వల్ల అయ్యే ఖర్చు ఎంత?”… సుమారు రూ. 22 లక్షలవుతుందని సమాదానం రాగానే కలాం ఆ డబ్బును అనాధ ఆశ్రమాలకు ఆహారం, బట్టలు, దుప్పట్ల రూపంలో ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించారు. నన్ను మళ్ళీ పిలిచి, ఒక లక్ష రూపాయల చెక్కును అందించారు… ఇది తన పర్సనల్ చారిటీ అని దీనిని బహిర్గతం చేయొద్దని అనడంతో, కలాం త్యాగానికి ఫిదా అయిపోయాను…

• ఓ సందర్భంలో కలాంను కలవడానికి బందువులు, సన్నిహితులు కలిపి 50 మంది దాకా వచ్చారు. వారందరూ రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నపటి నుండి, సిటీ మొత్తం చూడడం, బోజనాలు, తదితర వసతులకు అయిన మొత్తం ఖర్చు 2 లక్షలు రూపాయలు అయ్యాయి… సాధారణంగా ఎవరైనా ఈ ఖర్చును ఎందులో వేస్తారో మనందరికి తెలుసు… కాని కలాం గారు 2 లక్షలు తన పర్సనల్ అకౌంట్ నుంచి చెల్లించి ఇంత నిస్వార్ధపరులు ఉంటారా? అన్నంతలా నన్ను నివ్వెరపరిచారు.

• కలాం రాష్ట్రపతి పదవీకాలం దాదాపు పూర్తవుతున్న సమయంలో ప్రతిఒక్కరూ కూడా ఆయనను ప్రేమ పూర్వకంగా కలవడానికి వస్తున్నారు. నేను కూడా ఎంతో వినయంతో కలాంను చేరుకున్నాను. ‘నీ భార్య రాలేదా?’ అని కలాం అడగగా.. తన భార్యకు యాక్సిడెంట్ అయ్యి, బెడ్ రెస్ట్ లో ఉన్నారని చెప్పాను. మరుసటి రోజు ఇంటిచుట్టూ పోలీసు బందోబస్తును చూసి ఏంటా? అని అనుకుంటుండగానే.. అంతలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. దేశ ప్రథమ పౌరుడు అయి ఉండి ఇంత ఒదిగిన గుణం చూసి కలామ్ ను తన హృదయంలో చెరగని ముద్రగా పదిలపరుచుకున్నాడు.

కామెంట్‌లు లేవు: