15, అక్టోబర్ 2020, గురువారం

శ్రవణం నక్షత్రము

 శ్రవణం నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు


   నక్షత్రములలో శ్రవణ నక్షత్రము 22వది. శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. 


శ్రవణం నక్షత్రము మొదటి పాదము  

శ్రవణానక్షత్ర మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరి మీద కుజ చంద్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవగణ ప్రధానులు. కనుక వీరు సౌమ్యంగా వ్యవహరిస్తారు. మరికొన్ని సమయాల్లో ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ తమ భావాల మీద నియంత్రత కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలను, కోపతాపాలను మార్చుతుంటారు. వీరు ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. శ్వేతవర్ణ, రక్త వర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సైనిక, ఔషధ సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలమే. విద్యుత్, అగ్ని సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 


ఈ నక్షత్ర జాతకులకు ఎనిమిది సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్ర దశ కాలంలో వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 15 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో ఉన్నత విద్యకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక పట్టుదలతో వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు. వివాహంలో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. 


ఇక 33 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సంపదనలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిలపరచుకోవాలి. 49 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఇక 68 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది.


శ్రవణం నక్షత్రము రెండవ పాదము   

వీరు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి . ధర్మంపక్షం వహిస్తారు. వీరికి కొంత స్థిర స్వభావం ఉంటుంది. ఇక వీరు కళాత్మక వస్తువులను సేకరించడానికి ఆసక్తి చూపుతారు. విలాస జీవితం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది. వీరికి శ్వేతవర్ణ సంబంధిత వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబందిత, పర్యాటక సంబంధిత, ఔషధ సంబంధిత వృత్తి , ఉద్యోగ, వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం. 


ఇక ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 13 సంవత్సాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో మాధ్యమిక విద్యలోఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం. జీవితంలో స్థిరపడడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇక వివాహంలో కొంత ఆలస్యం అవుతుంది. 


ఇక 31 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో , సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరచుకుని ఇబ్బందులను ఎదుర్కొవాలి. 47 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగి పోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. ఇక వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది. 


శ్రవణం నక్షత్రము మూడవ పాదము  

వీరు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. ఇక జాతకులకు ధర్మం అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వీరు ఔషధ తయారీ సంస్థను స్థాపించి నిర్వహించగలరు. వీరికి విద్యా సంబంధిత, భూ సంబంధిత, ఔషధ సంబంధిత వ్యాపారం, ఉద్యోగం, వృత్తులు అనుకూలిస్తాయి.  


ఇక ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 11 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఇక జీవితంలో స్థిరపడడానికి ఆలస్యమయ్యే అవకాశం. వివాహం విషయంలోనూ కొంత జాప్యం ఉంటుంది. 29 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరుచువలసిన అవసరం ఎంతో ఉంది. 45 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది. వృద్ధాప్యం సమస్యారహితంగా సాగిపోతుంది.

 

శ్రవణం నక్షత్రము నాలుగవ పాదము

వీరు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరికి తల్లితో అనుబంధం అధికం. వీరు తరచూ భావోద్రేకాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. వీరి భావాలు తరచూ మారుతూ ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులు భావోధ్వేగాలను (ప్రేమ, అభిమానం, కోపతాపాలు) మార్చిమార్చి ప్రదర్శిస్తారు. శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారం , ఉద్యోగం వీరికి అనుకూలం. ఔషధ రంగానికి సంబంధించిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. 


ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రెండు సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వరకు వీరికి బాలారిష్టాలు సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. 9 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలోఆటంకాలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు.వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. 


ఇక 27 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఎంతో ఉంది. 43 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 62 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం సమస్యారహితంగా సాగిపోతుంది.

శ్రవణం నక్షత్ర జాతకుల గుణగణాలు


ఈ నక్షత్ర జాతకులు వీలైనంత తక్కువగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మంతో జీవితం సాగిస్తారు. చదువు పట్ల శ్రద్ధ.. సమాజంలో ఉన్నత స్థితి.. అవకాశాలను సద్వినియోగపరచుకొనుట.. సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి సహజ లక్షణములు. 


వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుంచి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి.


శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా వీరికి ఉండే విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. ఏ విషయాన్నైనా అంతర్గత ఆలోచించే వీరికి ఓర్పు కాస్త ఎక్కువ. అయితే కొన్నిసార్లు సహనం కోల్పోతారు. వీరికి ధైర్యం, మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి వస్తారు....మీ.... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: