*శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*
*శ్రీ సద్గురు పరమాత్మనే నమః – సర్వమహర్షిభ్యోనమః*
*జగద్గురు ఛారిటబుల్ ట్రస్ట్*
*9100939567*
*ఓం శ్రీ లలితాంబికాయై నమః*
*సౌందర్య లహరి – సాధన*
*ప్రథమ భాగః – ఆనంద లహరి*
*శ్లోకం 32*
*శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః*
*స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |*
*అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా*
*భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||*
*ప్రతిపదార్థము :*
*జననీ* = మాతా!;
*శివః* = శివుడు; శక్తిః = శక్తి;
*కామః* = మన్మథుడు;
*క్షితిః* = భూమి;
*అధః* = అటుపైన;
*రవిః* = సూర్యుడు;
*శీతకిరణః* = చంద్రుడు;
*స్మరః* = మన్మథుడు;
*హంసః* = సూర్యుడు;
*శక్రః* = ఇంద్రుడు;
*తత్ అనుచ* = వానికి తర్వాత;
*పరా* = పరాశక్తి;
*మారః* = మన్మథుడు;
*హరయః* = హరి, (విష్ణువు);
*అమీ* = ఈ పన్నెండు అక్షరాలు;
*త్రిసృభిః* = మూడు విధాల;
*హృల్లేఖాభిః* = హ్రీం కారముల చేత;
*అవనానేషు* = విరామస్థానాలలో;
*ఘటితాః* = సమకూర్చబడినవై;
*తే వర్ణాః* = ఆ అక్షరాలు;
*తవ* = నీ యొక్క;
*నామావయవతాం* = రాజరాజేశ్వరి దేవీ మంత్రం యొక్క అవయవాలుగానే;
*భజన్తే* = అంగీకరింపబడి;
సమస్తాన్నీ పొందుతున్నాయి.
*తాత్పర్యము / భావము :*
*మంగళ ప్రదమైన ‘క’ వర్ణమూ, “శక్తి”ని బోధపరచే “ఏ” వర్ణమూ, కామ ప్రదమైన “ఈ” వర్ణమూ, పృథ్వీ ప్రతిపాదితమైన “ల” వర్ణమూ, తేజస్సుతో కూడిన “హ” వర్ణమూ, శీతలత్వాన్ని చేకూర్చే “స” వర్ణమూ, తత్వాన్ని సూచించే (క) వర్ణమూ, సూర్య బోధితమగు “హ” వర్ణమూ, ప్రతిభను సువ్యక్తంచేసే “ల” వర్ణమూ, పరబ్రహ్మను సువ్యక్తం చేసే సకల వర్ణాలనూ ‘హ్రాం హ్రీం హౄం’ అన్న మూడక్షరాలు చివర చేర్చబడినవై (ఇంతకు ముందే బీజాక్షర ప్రశక్తి చెప్పబడినది). నీ నామావయవము లవుతున్నాయి.*
*కంఠమునకు క్రింది నుండి మొదలుకొని, కటి పర్యంతం నితంబ (పిరుదుల) ప్రదేశము వరకు ఉండే కామరాజకూటమి అనే; (మధ్య కూట స్వరూపిణీ) – మధ్యకూటము స్వరూపముగా గలది.*
*పంచదశీ మంత్ర రాజము యొక్క అయిదు అక్షరములు వాగ్భవ కూటము. అది ముఖ రూపము అని తెలియదగును.*
*కంఠము నుండి కటి పర్యంతము ఉండే భాగము మధ్య కూటమి అని తెలుపబడుచున్నది. దీనినే "కామ రాజు కూటమి" అనియు అందురు. మొదటిది సూక్ష్మము, రెండవదియైన ఇది సూక్ష్మతరము అనబడును. "హ-స-క-హ-ల-హ్రీం" అనే షడక్షరములు, మధ్య భాగముగ భావించి ఉపాసించి తరింతురుగాక. పంచదశీ మంత్ర రాజమునకు ఇప్పటికి 5+6 = 11 అక్షరములు వచ్చినవి. సూక్ష్మరూపమైన పంచదశీ మంత్ర షడక్షరములకు ౼ స్థూలరూప కంఠ్యాధ్యో భాగమునకు దీనిచే అభేదము గ్రహింప దగును.*
*పంచదశాక్షరీ మంత్రానికి శ్రీం బీజం జత చేస్తే షోడశి అని లొల్ల లక్ష్మీ ధర పండితుల వాఖ్య. కాగా కొందరు ఈ బీజము జతచేయడమే షోడశాక్షరి అని నిర్ధారిస్తున్నారు. 'ఈం'కారమే లక్ష్మీ బీజాక్షరం అని, శ్రీ సూక్తంలో చెప్పబడిన 'పద్మినీ మీమ్ శరణ మహం ప్రపద్యే' అనేది దీనికి ప్రమాణమని వీరి భావము.*
*ఋషి పత్ని లోపాముద్ర అర్చించిన పంచదశాక్షరీ మంత్రమిది ౼ 'క ఏ ఈ ల హ్రీం హసకల హ్రీం సకలహ్రీం'.*
*ఉపాసన :*
*బంగారు రేకుపై చెక్కించి పూజించాలి. పెరుగు అన్నం, మినపగారెలు నివేదించాలి. జపసంఖ్య రోజుకి 1000 సార్లు, రసవిద్య లబ్ధికి ఈ ఆరాధన శ్రేష్ఠమైనది.*
*శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః*
*స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |*
*అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా*
*భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి