శ్రీరామ *కనకమాలిక.*
*రా* మరామ యని రమ్యనామ! నిను *ర* క్షణంబు నిడ వేడనా,
*నా* మనోగతము నీ వెఱుంగవొకొ? *నన్* గృపన్ గనఁగ లేవొకో?
*రా* మనామ మదె క్షేమ మిచ్చు నని *వ్రా* యుచుందురుగ సత్కవుల్
*రా* మ నిన్ విడువ, ప్రాణ మీవె కద, *ర* మ్మికన్ కనకమాలికన్.
🙏🙏🙏
భక్త జన విధేయుఁడు,
చింతా రామకృష్ణారావు.🙏
*కనకమాలికా వృత్తము.*
గణములు.
ర న ర న ర న ర.
యతి. 13.
ప్రాస నియమము కలదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి