15, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


*శ్రీమన్నారాయణీయం*


1-9-శ్లో.


కారుణ్యాత్కామమన్యం దదతి ఖలుపరే స్వాత్మదస్త్యం విశేషాత్

ఐశ్వర్యాదీశతే౾న్యే జగతి పరజనే స్వాత్మనో౾పీశ్వరస్త్యమ్l

త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః

త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధారా! శౌరే! నమస్తే||


భావం. 

కృష్ణా! ఇతర దేవతలు భక్తుల యందు కలుగు కరుణచే వారి కోరికలను తీర్చెదరు. నీవు మాత్రము భక్తులకు నీ ఆత్మనే ఇచ్చెదవు. ఇతర దేవతలు తమ శక్తులచే లోకమును పరిపాలించగలరు. నీవు జీవుల చిత్తములందు ఙ్ఞానానందముతో ప్రకాశించుచూ జగత్తునే పరిపాలించుచున్నావు. నీ నామమును ఉచ్ఛరించుచూ ఆనందమును పొందు భక్తుల ఆత్మలతో రమించు ఆత్మారాముడివి నీవు. పోలిక లేని సత్వగుణములకు నిలయమయిన శౌరీ !నమస్తే! .

(తెలుగుభాగవతం.ఆర్గ్)


వ్యాఖ్య. భట్టతిరి గారు ఈ శ్లోకాలలో వ్యక్తీకరించినది భగవద్గీతలో స్వామి వారు బోధించిన మార్గానికి అనుష్ఠానపరంగా భాసిస్తోంది.


యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి !

తస్య తస్యాచలాం శ్రద్దాం 

తామేన విదధామ్యహమ్ !!  

అ.7 శ్లో.21


భక్తుడు ఏదేవతాస్వరూపము లను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తు నకు ఆ దేవతలయందే భక్తిశ్రద్ధలను స్థిరముగా నేనే కలుగజేయుచున్నాను.


భగవ ద్భక్తి , అదీ శ్రీక్రృష్ణుల వారిపై భక్తి అనేది ఎంతో పవిత్రమైనది అయి, శాశ్వత విసయాన్ని తెలుసుకున్న భక్తులకే అవగతం ఆవుతూ ఉంటుంది. కాని ప్రపంచంలో కృష్ణ భక్తికిి దూరం గా ఉంటూ వేరే దేవీ దేవతలని కోరికలతో పూజిస్తూ ఉంటారు. సాక్షాతూ శ్రీకృష్ణుల వారు ఉండగా వేరే దేవీ దేవతల మీద భక్తి ఎందుకు కలుగుతోంది అన్న ప్రశ్నకి స్వామి వారే సబబు. ఏమంటున్నారో చూడండి.


తన పైన కాకుండా ఇతర దేవీ దేవతలపై భక్తి కలుగడం అన్నది తనే స్ఫురించ చేస్తూ వుఃటాను అంటున్నారు. ఏ ఏ భక్తులు తమ కోరికలు తేర్చుకుందుకు వేరే దేవీ దేవతలని ఉపాసిస్తూ ఉంటారో, వారికి ఆ భక్తిని కావాల్సిన ధ్రృఢత్వాన్ని ఇచ్చి అది సాధించేలా వ్యవహ రిస్తున్నారు. ఒక విధంగా ఆ ఆత్మలో ఉన్న పరమాత్మే వారిలో ఆ భక్తిని స్థిర పరచి, వారు కోరుకున్న భోగాల్ని పొందేలా చేస్తారు. 


స తయా శ్రద్ధయా యుక్తః

తస్యారాధనమీహతే !

లభతే చ తతః కామాన్

మయైవ విహితాన్ హి తాన్ !!  

అ.7 శ్లో.22


అట్టి భక్తుడు తగిన భక్తిశ్రద్దలతో ఆ దేవతనే అరాధించును. తత్ఫలితముగ నా అనుగ్రహం వలననే ఆ దేవత ద్వారా ఫలములను అతడు పొందుచున్నాడు.


కోరికలతో వేరే దేవీ దేవతలని ఆరాధించే వాళ్ళకు వాళ్ళు పొందే వరాలను వేరే దేవతలు అనుగ్రహిస్తున్నారు అని అనిపించినా, నిజానికి అవి ఆ పరమాత్ముడైన శ్రీక్రృష్ణుల వారు అందించిందే అని మనం అర్ధం చేసుకోవాలి. 


అన్య దేవీ దేవతలకు వారంతట వారుగా ఈ వరాలను అనుగ్రహించే శక్తి కలిగి ఉండరు. శ్రీకృష్ణుల వారు అనుగ్రహిస్తేనే వీరు దానిని ఇవ్వ గలుగుతారు. కాపోతే అది అర్ధం చేసుకోని వారు ఆ పర దేవతలే వరదేవతలు అనుకుని మురిసిపోతూ ఉంటారు.

 స్వస్తి.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: