15, అక్టోబర్ 2020, గురువారం

ధార్మికగీత - 50*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                       *ధార్మికగీత - 50*

                                   *****

         *శ్లో:- వేద మూల మిదం బ్రాహ్మ్యం ౹*

                *భార్యా మూల మిదం గృహం ౹*

                *కృషి మూల మిదం ధాన్యం ౹*

                *ధన మూల మిదం జగత్ ౹౹*

                            *****

*భా:- భారతీయ సంస్కృతికి, శాస్త్రీయవిజ్ఞానానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దేశ విదేశాలలో సప్రమాణంగా అద్దంపట్టి చూపుతున్న వేదాలు, వేదాంగాలు,ఉపనిషత్తులు "బ్రహ్మత్వాని"కి మూలకారణము. షట్కర్మలలో ఆరితేరి, సతీత్వధర్మ నిరతయై, ఓర్పు,నేర్పులతో కష్ట సుఖాలలో కూడా సంసారాన్ని సమర్ధవంతంగా నడిపించగల భార్యామణియే ఇంటికి మూలస్థంభము. విభిన్నవాతావరణములను, ప్రభుత్వ విధి విధానాలను, ఆర్థిక,సామాజిక క్లేశాలను, ప్రతికూలతలను అధిగమించి కాయకష్టంతో దైవాన్ని నమ్ముకొని చేసిన అన్నదాత శ్రమయే ధాన్య ఉత్పత్తికి, సంపత్తికి ప్రధాన ఆలంబనము. ఇక లోకంలో నేడు ప్రతి పనికి డబ్బు కావాలి. శిశుపోషణ, విద్య,ఉపాధి,వివాహ ఇత్యాది ఆహార వ్యవహారాలకు మూల ఇంధనము ధనమే. జగన్నాటకానికి ముఖ్యంగా కావలసినది ధనమే. ఈ లోకంలో జ్ఞానం, సుగుణవతి అయిన భార్య, జీవనానికి ధాన్యము, అవసరాలకు సరిపడా ధనం ఉంటే ఇంక సుఖకర జీవనానికి లోటేమిటి ? అని సారాంశము.*

                               *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: