*శివం - శవం*
*చిరిగి పోయిన సంచిలో బంగారం పెడితే ఆ సంచి చిరిగి వున్నా, సంచి కి విలువ ఉంటుంది.*
*సంచి నుండి బంగారాన్ని వేరు చేస్తే,*
*ఆ సంచికి విలువ లేదు.*
*దాని వలె, మన శరీరమనే 9రంధ్రాల చిరిగిన సంచిలో, ఆత్మ అనే భగవంతుడు ఉన్న వరకే ఈ శరీరానికి విలువ.*
*శరీరంలోని ఆత్మ బైటికి వెళ్ళాక, ఈ శరీరాన్ని ముట్టటానికి కూడా అయినవాళ్ళు ఆలోచిస్తారు.*
*అంటే బంగారానికి విలువ ఉంది కానీ, సంచికి కాదు.*
*అలాగే చైతన్య స్వరూపుడైన భగవంతుడికి/ ఆత్మ విలువ వుంది కానీ, మన శరీరానికి కాదు.*
*శరీరంలో జీవం ఉంటే శివం*,
*శరీరం నుండి జీవి వెళ్లిపోతే శవం.*
*ఈ శరీరంలో జీవం వున్నప్పుడే, నలుగురికి ఉపయోగపడాలి.*
*నిరంతరం ధ్యాన సాధన చేయాలి.*
🙏 *లోకా సమస్త సుఖినోభవంతు* 🙏
🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺🧘🏼♀️🔺🧘🏼♂️🔺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి