15, అక్టోబర్ 2020, గురువారం

పరమాత్మ తో

 పరమాత్మ తో మన వ్యవహారం


ఒకరిని మనం ఇష్ట పడుతున్నాము అంటే, అది

మన మనస్సు యొక్క ప్రవర్తన. 

ఒకవేళ మన మనస్సు వారిని ఇష్ట పడక పోతే, వారిని ద్వేషిస్తాము.

ఇది మన మనస్సుకు మనము ఇచ్చే ఆహారము.


ఒకరిని అనుసరిస్తున్నాము అంటే,  

వారు చెప్పే దానిలో, 

లేదా వ్రాసేదానిలో జ్ఞానం గ్రహిస్తున్నాము. 

ఇది వారి ద్వారా మన బుద్ధికి ఇచ్చే ఆహారం.


ఒకరిని ప్రేమిస్తూన్నాము అంటే,  

వారిని మన భావనలో మనకంటే ఎక్కువగా చూస్తున్నాం. 


వారికి కావాల్సింది తెలుసుకొని వారు అడగకుండానే, మళ్ళీ ఇస్తారు, ఇవ్వాలి, అన్న భావము లేకుండా వారికి ఇస్తాము. 


వారికి ఏది ఇష్టమో తెలుసుకొని వారు అది కొరకున్నా, 


మనంతట మనం వారికి ఇస్తాము, 

లేదా వారికోసం చేస్తాము. 


ఒక వేళ వారు మనకి దూరంగా కనబడకుండా ఉంటే, వారిని ఎపుడెప్పుడు చూస్తామా అని ఆరాట పడతాము. 


వారితో ఎదో విధంగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాము.


ఇలా ఇవన్ని మనం ప్రేమించేవారికోసం చేస్తాము.


మరి మనం కనక పరమాత్మ ని ప్రేమిస్తే,  


ఆయానతో నాకిది చేస్తే నీకిది చేస్తా అన్ని వ్యాపారాలు చేస్తామా?

చెయ్యకూడదు కదా!!


అమ్మో ఆయనకి ఇది చేయకపోతే, నెత్తి అనుస్తాడు అని భయపడి పోతామా?

అలా భయపడకూడదు కదా!!


ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, మనం చెప్పేది వింటాడో వినడో తెలియదు అని ఆయనను తలవడం మర్చిపోతామా.


మర్చిపోకూడదు కదా, 

ఆయన మనలోనే, నిశ్శబ్దంగా మనని ప్రేమీస్తున్నాడు అని తెలుసుకోవాలా వద్దా?


ఒకవేళ మనం ఆయనని ప్రేమిస్తే కనుక


ఆయనను మన భావనలో మనకంటే ఎక్కువగా చూడాలి కదా!

అలా చుస్తున్నామా? 


ఆయనకు కావాల్సింది తెలుసుకొని, 

ఆయన అడగకుండానే,  

ఆయనకి ఇవ్వాలి కదా. 

ఇస్తున్నామా?

ఆయనకి ఎం కావాలి అని సందేహమా, 

ఆయనకి తన సృష్టిలోని ప్రాణికోటీని తనలాగా ప్రేమించమని కోరతారు మననుంచి.

అది చేస్తున్నామా మనం


ఒక వేళ ఆయన మనకి దూరంగా కనబడకుండా ఉంటే, (అలా అనుకోవడము మూర్ఖత్వం, ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు కనక) ఎపుడెప్పుడు చూస్తామా అని ఆరాట పడనవసరం లేదు, మనం. ఇది తప్పు కాదా?


మనం అంతర్ముఖం అయిన మరుక్షణం ఆయన సన్నిధిలో ఉంటాము. 

ఆయనతో కమ్యూనికేట్ చేయ్యాలి అంటే ప్రార్ధన (మన వైపు నుంచి ఆయనకి కమ్యూనికేషన్ కోసం ), మౌనం (ఆయన వైపు నుంచి మనకి కమ్యూనికేషన్ కోసం ) చెయ్యాలి కదా. అలా చేస్తున్నామా?

చెప్పండి.


నేను కూడా ఇలా చేయడంలేదేమో, చెయ్యాలి కదా, చేస్తా లెండి.


అంతే గా


ఏమంటారు

కామెంట్‌లు లేవు: