15, అక్టోబర్ 2020, గురువారం

హిమనగంబు

 హిమనగంబు

౼౼౼౼౼౼౼౼

విష్ణు పర్యాయమై విశ్వ వేద్యమ్మునై

       కౌబేర దిశలోన గ్రాలుచుండు

యజ్ఞాల యాగాల నజ్ఞానమెడమైన

        ఆనంద జీవన మ్మందుచుండు

నిర్ద్వంద్వ చర్చలన్ నిర్దేశ ధామమై

        నిఖిలోర్వి శాసించు సుఖమునందు

ఇనుడైన ఘనుడైన ఇలజేర బ్రతిమాలి

         యనుమతింగొనురీతి నతిశయించు


సతము పర్యాటకులకెల్ల హితముగొల్పు

సుందరంబైన దృశ్యాల చూపుచుండు

కనగ కందర్ప దర్పంబు క్ష్మాజనంబు

హిమ విహితరాగ దీప్తంబు హిమనగంబు.


రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

కామెంట్‌లు లేవు: