15, అక్టోబర్ 2020, గురువారం

సువాసినీ, కుమారీ పూజల ప్రాధాన్యం


నవరాత్రులు లో సువాసినీ, కుమారీ పూజల ప్రాధాన్యం ఏమిటి?

      శాంత స్వరూపం, స్థిర చిత్తం, సద్గుణం, భక్తి, వినయవిధేయతలు కలిగిన ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి, ఆమె దీవెనలు పొందడమే సువాసినీ పూజ. నడివయసు స్త్రీ కి చేసే పూజ ఇది. అలాగే కన్యలను పూజించే ఆచారం కూడా ఉంది. ఒక్కో వయస్సు కన్యను ఒక్కో నామధేయంతో ఆరాధించడం సంప్రదాయం. ఈ నవరాత్రులు లో ఎందరు కుమారికలను పూజించితే ఏ ఫలితం కలుగుతుందో దేవీ భాగవతము తెలియజేసింది.

         ఒక్క కన్యకను పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇద్దరు కన్యలను పూజిస్తే భుక్తి, ముక్తి కలుగుతాయి. ముగ్గుర్ని పూజిస్తే ధర్మ కామాలు సిద్ధిస్తాయి. నలుగురు ని పూజిస్తే శత్రునాశనం అవుతుంది. అయిదుగురు ని పూజిస్తే విద్యాలాభం, ఆరుగురు ని పూజిస్తే షట్కర్మ సిద్ధి. ఏడుగురు ని పూజిస్తే రాజ్యలాభం. ఎనిమిది మంది ని పూజిస్తే సర్వగుణ లాభం. తొమ్మిది మంది కన్యలను పూజిస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది. కన్యాపూజకు తొలి నియమం ఏమిటంటే కన్యకల వయస్సు 2-10సంవత్సరాల మధ్య ఉండాలి. రెండేళ్ల బాలిక మహాలక్చ్మీ స్వరూపం. ఆమె తల్లి లేక నిలబడలేదు. అందువల్ల అటువంటి బాలికలను కన్యాపూజకు నియమించి కష్ట పెట్ట కూడదు. 2నుంచి పది సంవత్సరాల వరకూ ఒక్కో వయస్సు బాలికకు ఒక్కో పేరుంది.

కుమారి(2ఏళ్ళబాలిక):కుమారిని పూజిస్తే దారిద్ర్యం దుఃఖం పోతుంది. శత్రువులు నశిస్తారు. ఆయుష్షు, బలం, ధనం వ్రుద్ధి పొందుతాయి.

త్రివర్ష(3 ఏళ్ళ బాలిక) :త్రివర్ష లేదా త్రిమూర్తి పూజ వల్ల పుత్రపౌత్రాభి వ్రుద్ధి కలుగుతుంది. ఆయుష్షు, ధనదాన్య సమ్రుద్ధి, త్రివర్గ ఫల ప్రాప్తి పొందుతారు.

కళ్యాణి(4 ఏళ్ళ బాలిక) :విద్యార్ధి, విజయార్ధి, రాజ్యసుఖార్ధి కళ్యాణిని పూజించాలి.

రోహిణి (5 ఏళ్ళ బాలిక) :రోగాలతో బాధపడే వారు రోహిణి ని అర్చించాలి.

కాళిక(6 ఏళ్ళ బాలిక) :శత్రునాశనం నకు కాళికను పూజించాలి.

చండిక(7 ఏళ్ళబాలిక) :ఐశ్వర్య ప్రాప్తికి చండికను పూజించాలి.

శాంభవి (8 ఏళ్ళ బాలిక) :దారిద్య్ర శోక నాశనానికి, సమర విజయానికి, అధికారులు ను మెప్పించడానికి శాంభవిని పూజించాలి.

దుర్గ (9 ఏళ్ళ బాలిక) :క్రూరమైన శత్రు బాధలను పోగొట్టడానికి, పరలోక సుఖాలు పొందడానికి దుర్గను పూజించాలి.

సుభద్ర (10 ఏళ్ళ బాలిక) :సుభద్ర కోరిన కోర్కెలు తీర్చగలదు.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: