🔔శరన్నవరాత్రులు -
శ్రీ వేంకటేశ్వరుని అలంకారాలు🔔
☘️🌷☘️
సాధారణంగా నవరాత్రులనగానే అమ్మవారి ఉత్సవాలు గా అనేకమంది భావిస్తారు. ఈ ప్రత్యేక దినాలలో
ముగ్గురమ్మలను కీర్తిస్తూ, విశేషాలంకరణలతో ఆరాధిస్తాము.
శివాలయాలలోను, శక్తి ఆలయాలలోను
ప్రతి నిత్యం రకరకాల అలంకారాలు చేసి పూజించినట్లే , శ్రీవైష్ణవ క్షేత్రాలలో కూడా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
ఈ సమయంలో అమ్మవారికి
చేసే అలంకారం లో వ్యత్యాసమేమిటంటే
పుష్ప అలంకారం మాత్రమే
చేస్తారు. కాని వేంకటేశ్వరస్వామి కొలువున్న ఆలయాలలో
మాత్రం తొమ్మిది రోజులు
తొమ్మిది రకాల అలంకారాలు చేసి పూజిస్తారు.
అమ్మవారికి అలంకారం చేయకుండా
శ్రీ నివాసునికి మాత్రమే
చేయడంలోని అంతరార్ధం
యిదే.
శ్రీ మహావిష్ణువు తన వక్షస్ధలాన శ్రీ మహాలక్ష్మీకి నిరంతర స్థావరం కల్పించాడు.
ఐక్యతత్వం గా
శ్రీ మహాలక్ష్మి
సదా
సర్వాలంకారభూషితయై మహావిష్ణువు వక్షస్ధలాన నివాస మేర్పరుచుకున్నది.
అందువలన, తిరిగి అమ్మవారికి
ప్రత్యేక అలంకారం చేసి దర్శించేకన్నా శ్రీ మహావిష్ణువు కి అలంకారాలు చేయడం వలన ఇద్దరినీ ఏకకాలంలో అలంకరించి ఆరాధించినట్లుగా భావిస్తారు.
నవరాత్రి తొమ్మిది రోజులలో
శ్రీ వేంకటేశ్వరుని
🌷మొదటి రోజున వెన్న కుండతో వున్న
కృష్ణుని గా.
☘️రెండవ రోజున కాళింగ మర్దనునగా.
🦚మూడవరోజు న: వేణు గోపాలునిగా.
🔔నాలుగవ రోజున : వైకుంఠనాధునిగా.
🔯ఐదవ రోజున : ఆండాళ్ నాచ్చియార్ రూపంలో.
🌸ఆరవ రోజున: సారంగపాణి
రూపంలో.
💐ఏడవ రోజున : రాజగోపాలుని రూపంలో.
🔔ఎనిమదవ రోజున: శ్రీ రంగనాధుని అలంకారం.
🌳తొమ్మిదవ రోజున : రామపట్టాభిషేకం అని
నవరాత్రి
తొమ్మిది రోజులు నిత్యం ఒక్కొక్క అలంకారం చేసి
లక్ష్మీనారాయణులను
పూజించి ఆరాధిస్త
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి