15, అక్టోబర్ 2020, గురువారం

అమ్మవారి

 




చాలా అరుదైన ఫోటో ఇది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా మహాలక్ష్మి ఈ ఎనిమిది మంది దేవతల తో కూడుకొని ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో ఇది.


ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ముహూర్తాలు.


17 - 10 - 2020

శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రలుగా జరిపి , పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధతులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి. నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు అంగ్ల తేది ప్రకారం 17 అక్టోబర్ 2020 దేవి శరన్నవరాత్రారంభం.


🍁 17 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, శనివారం మొదటి రోజున #బాలాత్రిపుర #సుందరీ అలంకారం.


ముహూర్తం :- కలశస్థాపన శుభ సమయం ఉదయం 7:38 నిమిషాల నుండి 11:29 వరకు, మధ్యాహ్నం 11:29 నుండి 12:16 వరకు.


నైవేద్యం - పులగం🙏


🍁 18 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ విదియ, ఆదివారం రెండవ రోజున #గాయత్రీదేవి అలంకారం.


ఉదయం 8:05 - 8:35 , సాయంత్రం 6:18 - 6: 56


నైవేద్యం - పులిహోర🙏


🍁 19 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ తదియ, సోమవారం మూడవ రోజున #మహాలక్ష్మిదేవి అలంకారం


ఉదయం 9 :05 - 9 :30 , సాయంత్రం 5 :35 - 6:30


నైవేద్యం - వడపప్పు, పానకం🙏


🍁 20 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ చవితి, మంగళవారం నాల్గవ రోజున #అన్నపూర్ణ అలంకారం.


ఉదయం 7:02 - 7:40 , సాయంత్రం 5:05 - 5:32


నైవేద్యం - పరమాన్ణం,బూరెలు🙏


🍁 21 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పంచమి, బుధవారం ఐదవ రోజున #లలితాదేవి అలంకారం.


ముహూర్తం:- సరస్వతీ ఆవాహనం ఉదయం 6:05 - 7:53 ( మూల 1 వ పాదం )


సరస్వతీ దేవి మూల నక్షత్ర పూజ ఉదయం 7:54 - 8:58


సరస్వతీ దేవి సాయాహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:39 వరకు


నైవేద్యం - పెసర బూరెలు,పరమాన్నం🙏


🍁 22 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్టి, గురువారం ఆరవ రోజున #శాకంబరీదేవి అలంకారం.


ముహూర్తం:- త్రిరాత్ర కలశస్థాపన సమయం ఉదయం 6:05 - 7:32


పూర్వాషాడ సాయహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:38


పూర్వాషాడప్రదోష పూజ సాయంత్రం 5:39 - 8:02


నైవేద్యం - శాకాన్నం (కూర అన్నం)🙏


🍁 23 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున #సరస్వతీదేవి అలంకారం.


ఉదయం 6:20 - 7:05 , సాయంత్రం 5:39 - 6:20


నైవేద్యం - కదంబం ప్రసాదం.🙏


🍁 24 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున #దుర్గాష్టమి #దుర్గాదేవి అలంకారం.


ముహూర్తం:- ఉదయం 7:38 - 8:59, మధ్యాహ్నం 11:28 - 12:14 , సాయంత్రం 5:37 - 7:11


నైవేద్యం - నిమ్మకాయ పులిహోర


24 -10 -2020 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 - 8:59🙏


🍁 25 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున #మహిషాసురమర్దినీ అలంకారం.


ఉదయం 8:45 - 9:15 , సాయంత్రం 6:12 - 6: 37


నైవేద్యం - చలివిడి,వడపప్పు,పానకం.


అక్టోబర్ 25


విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 - 11:57


శమీ పూజ, ఆయుద పూజలు ఉదయం 10:25 - మధ్యాహానం 12:14


అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 - 3:18


విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 - 2:32


విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 - 8:00 లేదా


🍁 26 అక్టోబర్ సోమవారం ఉదయం 6:06 - 8:24 


ఓం శ్రీమాత్రే నమః 🙏

(సేకరణ)

కామెంట్‌లు లేవు: