కామ = కోరికలను, దాయినీ = ఇచ్చునది (నెరవేర్చునది) కామములు అంటే కోరికలు.
1) భక్తుల కోరికలను నెఱవేర్చునది అని ఒక అర్థం. కామ’ అంటే ‘కామేశ్వరుడు’ అని అర్థం కాబట్టి, ‘కామేశ్వరుని ఇచ్చునది’, అనగా
2) శివుని ప్రాపు కలుగజేయునది అని ఇంకొక అర్థం. ‘దాయము’ అంటే ‘ఆస్తి’ అనే అర్థాన్ని బట్టి
3) ‘కామేశ్వరునే తన ఆస్తిగా గలది’ అనే అర్థం గూడా చెప్పుకోవచ్చును. అమ్మవారికి వరదముద్ర లేకపోయినా ఈ నామమే ఆ ముద్రను తెలియచేస్తుంది .
శ్రీ దేవిని సేవించువారికి సకల కోరికలు ఆమె తీరుస్తుంది. శివుని వ్యక్త రూపాన్ని శివ సాయుజ్యామును కూడా ప్రసాదించిన గలదు, ఇహపరములను అందించగల తల్లి, నమ్మి కొలిచే భక్తులకు వారి అభిష్టమును నెరవేర్చ గలదు. కామధ + అయిని అని పలుకటలో సమస్త కోరికలను పరిత్రుప్తికి అమ్మాయే శుభమగు వాహిని..అని అర్ధము. ఆమె సర్వకామప్రద. భక్తితో సేవించు వారికి వర ప్రదాత బ్రహ్మ సహితము ఆమెను ప్రార్థించి ఇచ్చా శక్తిని కలిగి సృష్టిని నిర్వహించుచున్నారు..ఇచ్చాశక్తి, క్రియశక్తి, జ్ఞానశక్తి, ఆ తల్లే కావడం వల్ల.. మంచి ఆలోచనా శక్తి ఆ ఆలోచన నెరవేర్చే శక్తి ఆ జగన్మాత… మనోబుద్ది అహంకార రూపం కూడా ఆమె..మనలో ఎటు వంటి ఆలోచనకు కోరికలకు తావు ఇస్తామో అటువైపుకు నిన్ను నడిపించగలదు అను చెప్తూనే..ఇంకో వైపు శివకామేశ్వరుడిని కూడా వశం చేయగల శక్తి ఆమె అని తెలియ చేస్తున్నది…
శివున్ని సానిద్యం అత్యంత దుర్లభం అట్టి స్థితిని అనుగ్రహించగల శక్తి మీకు తుశ్చమైన కోరికలు కూడు నెరవేర్చ గలదు. ఇప్పుడు మన బుద్ధికి ఏది కావాలో నిర్ణయించుకోగల శక్తి ని ఎటు వైపు పయనించాల అని నిర్ణయించే శక్తి కూడా ఆమె మనకు ప్రసాదించింది… కనుక ఆత్మ చైతన్య మార్గంలో పయనించి పరంధాముని చేరుకుందామ లేక బాహ్య సుఖాలు చిల్లర కొరికాలతోనే జన్మను వర్ధ్యం చేసుకుందామో అది కూడా మనమే నిర్ణయించుకొని ఆ తల్లిని ఆశ్రయిద్దాము…
పుణ్యము చేసుకున్న వారు పుణ్య లోకాలకు వెళ్తాడు, పాపం చేసుకున్న వారు పాపలోకములో అనుభవిస్తారు… ఈ పుణ్యము పాపము కూడా నశించిన వారు మటుకే పరంధామునిలో చేరుకోగల మోక్ష స్థితిని పొందగలరు..ఎందుకు అంటే ఆ పరంజోతిలో నుండి వెలువడి నప్పుడు పుణ్యము ,పాపము అంటూ ఏ గుణము లేని నిర్వికార నిర్గుణ స్థితి నుండి వస్తుంది తిరిగి చేరుకునే సమయంలో అట్టి స్థితిని పొందిన వారే ఆ మోక్షమును చేరుకోగలరు…విషయ వాంఛలు , అదే వాసన గల జన్మకు కారణము అవుతుంది అదే జన్మ చక్రంలో తిరుగుతూ కర్మ ను అనుభవిస్తూనే ఉంటుంది… అట్టి స్థితి నుండి నిన్ను శివుని సాన్నిద్యాన్ని కూడా ఇవ్వగల తల్లి మనకు ఉన్నది ఆమె చరణాలను ఆశ్రయిద్దాము.
🙏స్వస్తి 🙏శ్రీ దత్త శర్మ 8277246156
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి