15, అక్టోబర్ 2020, గురువారం

శివామృతలహరి

 శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

అవనీభృన్నికరంబు వృక్షపశుపక్ష్యాదుల్ మహాంభోనిధుల్

లవలేశమ్మును మారువల్కపు నిశన్ లావొప్పపార్థించినన్

అవలోకించితి నీ చరాచర జగంబంతస్సమాధి స్థితిన్

శివ పూజావిధి మున్గియుండుట ప్రభో ! శ్రీ సిద్ధలింగేశ్వరా!


భావం;ఈ భూమిమీద నివసించే అన్ని సమూహములు చెట్లు, పక్షులు, జంతుజాలములు,మహా సముద్రాలు,ఎంత వేడుకున్నా రాత్రి సమయంలో కొంచెం కూడా మారు పలకవు కదా!

ఇలా ఎందుకు జరుగుతోందా? అని ఆలోచిస్తే ఈ చరాచర జగమంతా

రాత్రిపూట సమాధి స్థితిలో కూర్చుని శివపూజా విధిలో మునిగిపోయి ఉందేమోనని నాకు అనిపిస్తోంది స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!


భావం, పద్య పఠనం;

సుబ్బు శివకుమార్ చిల్లర 

కామెంట్‌లు లేవు: