18, జనవరి 2026, ఆదివారం

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*

 * సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!


 అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:


ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:


👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

👉 *జననీ జన్మ భూమిశ్చ*

👉 *స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*

👉 *పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*


*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*


ధర్మ ఏవో హతో హంతి

"ధర్మో రక్షతి రక్షిత:"

తస్మా ధర్మో న హంతవ్యో

మానో ధర్మో హ్రతోవ్రధీత్


🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !


🔥 సత్యమేవ జయతే నా2నృతం

సత్యేన పంథా వితతో దేవయాన:

యేనా క్రమం తృషయో హా్యప్త కామా

యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్


🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.


🔥 అహింసా పరమో ధర్మ:

తథా2 హింసా పరం తప:

అహింసా పరమం ఙ్ఞానం

అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన


🔥 ధనమార్జాయ కాకుత్స్థ !

ధన మూల మిదం జగత్

అంతరం నాభి జానామి

నిర్ధనస్య మృతస్య చ


🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.


🔥 అపి స్వర్ణ మయీ లంకా

న మే రోచతి లక్ష్మణ !

జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి.


🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !


🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్

జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహం నాస్తి

నాస్తి జాగరతో భయం.


🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.


🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా

బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్


🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !


🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా

రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !


🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.


🔥 పుస్తకం వనితా విత్తం

పర హస్తం గతం గత:

అధవా పునరా యాతి

జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:


🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)


🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ

శత గ్రామేణ భూపతి:

శతాశ్వ: క్షత్రియో రాజా

శత శ్లోకేన పండిత:


🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.


🔥విద్వత్త్వం చ నృపత్వం చ

నైవ తుల్యం కదాచన

స్వ దేశే పూజ్యతే రాజా

విద్వాన్ సర్వత్ర పూజ్యతే.


🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.


🔥 శతం విహాయ భోక్తవ్యం

సహస్రం స్నాన మాచ రేత్

లక్షం విహాయ దాతవ్యం

కోటిం త్యక్త్వా హరిం భజేత్


🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.


🔥 అతి దానాత్ హత: కర్ణ:

అతి లోభాత్ సుయోధన:

అతి కామాత్ దశగ్రీవో

అతి సర్వత్ర వర్జయేత్

( ఇది మరోవిధంగా కూడా ఉంది)

కామెంట్‌లు లేవు: