13, మార్చి 2024, బుధవారం

పరమాత్మను

 *🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


🍁పరమాత్మను కనుక తెలుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే.ఆయనను గనక తెలుసు కొంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే._


🍁భవబంధాలనుంచి విముక్తి పొందాలంటే మనిషి తానైనదానికి, తాను కానీ దానికి మధ్య తేడాను అభ్యాసం చేయాలి. అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుకోగలుగుతాడు._


🍁చీకటి, అది కల్పించే భ్రమలూ అవన్నీ కూడా సూర్యుడు రానంతవరకే. సూర్యుడు వచ్చాకా అవన్నీ మటుమాయం కావలసిందే కదా ! అలాగే ఆత్మసాక్షాత్కారం కానంతవరకే ఈ మాయ పొరలన్నీనూ..


🍁నీవు కానిదాని గురించి ఆలోచించకు. అది నిన్ను కృంగదీస్తుంది. భాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీదా ద్రుష్టి సారించు. అది నిన్ను అన్నింటినుంచి విముక్తుడిని చేస్తుంది.


🍁మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది.


🍁సంపదల వెంట పరుగులు పెట్టకు. ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది. సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు. ఇది సంపద వల్ల వచ్చే ఫలితం.


🍁సూర్యుడు నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతూ ఉన్నట్లుగా, మహాత్ములు ఎల్లప్పుడు భాదల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తుంటారు


🍁నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన వృదయంలో ఉన్న అజ్ఞాన ముడిని విప్పేసుకుంటాడు.


🍁బంగారాన్ని మండుతున్న కొలిమిలో గనక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధుడౌతాడు.


🍁ఇంద్రియనిగ్రహంతో వైరాగ్యభావం గల మనిషిలో ఉన్న శాంతినీ, సంతోషాన్ని ఎవరు పోగొట్టగలరు...?_


🍁శ్వాసమీదనే ధ్యాస పెట్టుకొని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే.


🍁అజ్ఞానమే అన్ని బంధాలకు ఆదిమూలం. అదిపోతే దానితో బాటు వచ్చిన అన్ని బంధాలూ పటాపంచలవుతాయి.


 🍁తామరాకుమీది నీటిబిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు.


🍁ఇంద్రియాలు సహకరిస్తే సుఖం. అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖదుఃఖాలు రెండు కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకొంటే మంచిది.


🌸

కామెంట్‌లు లేవు: