చ.కలములు లేవు వాక్పటిమఁ గైకొని వ్రాయుదమన్న ధీమతిన్
వెలుగులు జిందు యంత్ర పరి వేష్టిత మీ చరవాణి చక్రమే
కలదని నమ్మ సర్వము కకావికలమ్మగు వంతఁ గూర్చెడున్
దలఁపఁగ పూర్వసత్కవుల ధారణ నెన్నఁగ మేలు భారతీ!౹౹ 55
చ.పరభృత రాగ వల్లరు లవాంఛిత మయ్యెను దిక్కు లేని యీ
కరభృత నాద వైఖరులె గానము లయ్యె నిదేమి మాయ?యె
ద్దరి చరవాణి దూషిత వితర్కిత భాషణ లెంచగా మనో
హరములుగా జనాళికిల హారములై చనె నేల భారతీ?౹౹56
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి