#రెండు_ఇడ్లీలు..
వేదవతి ప్రతిరోజు తన ఇంటి పిట్ట గోడపై ఆకులో రెండు ఇడ్లిలు పెడుతూ వచ్చేది
ఆకలితో ఉన్నవాళ్లు ఎవరైనా తింటారు అని
ఆ దారివెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లిలు తీసుకోవడం ఏదో చిన్నగా గొణుక్కుంటూ వెళ్లడం జరిగేది
ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది
అతను చెప్తున్న మాటలు
#నువ్వు_చేసిన_పాపం_నీదగ్గరే_ఉంటుంది
#నువ్వు_చేసే_పుణ్యం_వచ్చి_నిన్నే_చేరుతుంది
ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు
రోజు ఇడ్లి పెడుతున్నాను తీసుకు పోతున్నాడు
నువ్వు మహాలక్ష్మివి చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు
ఇడ్లిలు బావున్నాయని చెప్పకపోయినా పర్లేదు
ధన్యవాదాలు అమ్మ అని చెప్పడం కూడా తెలియలేదా ఇతనికి
ఏదో ఆ చెత్త వాగుడు వాగిపోతున్నాడు అని చాల కోపంతో రగిలిపోయింది అయినా ఇడ్లిలు పెట్టడం మరిచిపోలేదు
రోజురోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా మారిపోయింది
ఒకరోజు ఆ ఇడ్లిలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది
కానీ మనసు ఒప్పుకోలేదు
చేతులు వణకడం మొదలెట్టింది
ఆలోచన మొదలయింది
చ వద్దు అతను అలాఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లిలు పడేసి మంచి ఇడ్లిలు పెట్టింది
ఆ వ్యక్తి ఇడ్లిలు తీసుకుని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు
కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధాన పరుచుకుంది
ఆ రోజు మిట్ట మధ్యాహానం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటె వెళ్లి తలుపు తీసింది
ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు
అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్లిన తన కొడుకు
అమ్మా
ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేసారు
చేతిలో చిల్లి గవ్వ లేదు
బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను
ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లిలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు
ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది
విషం కలిపిన ఇడ్లిలు పెట్టుంటే నా కొడుకుకి నేనే యముడినై ఉండిఉంటానే అని కంటతడి పెట్టుకుంది
ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థం అయింది
*నువ్వు చేసిన #పాపం నీతోనే ఉంటుంది*
*నువ్వు చేసే #మంచి నిన్ను వెతుక్కొని మరీ వచ్చి చేరుతుంది*
అందరికి అన్ని అర్థం అవ్వవు
అర్థం అయ్యేంతవరకు ఎవరూ ఎదురుచూడము
*చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చిచేరుతుంది*
*ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి*
*మనం తెలియక చేసే తప్పులనుండి బయట పడే మార్గం మంచి చేయడం మాత్రమే*
🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి