పంటి నొప్పికి గృహ వైద్యం
మనలో చాలామందికి సాధారణంగా అప్పుడప్పుడు పంటి నొప్పి కలుగుతూ ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కారణం ఏదైనా కానీ పంటి నొప్పికి బాధపడని వాళ్ళు ఉండరంటే అతిశక్తి లేదు.
కానీ చాలామంది ఆ నొప్పి భరించలేక నొప్పి మాత్రలు బ్రో ఫ్ఫ్యాన్ లాంటి అనేక నొప్పి మాత్రలు వాడి శరీరాన్ని ఇబ్బందుల పాలు చేసుకునే వాళ్ళు తరచుగా మనకు కనబడతారు.
నొప్పి మాత్రలు ఎక్కువగా వాడితే అవి కిడ్నీల మీద తర్వాత లీవారు మీద దుష్ప్రభావం చూపుతాయి.
దాని వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి రుగ్మతలు రావటం జరుగుతుంది.
కిడ్నీలు కాలయము మనకు ఎంతో ముఖ్యమైనటువంటి అవయవాలు.
వాటిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉన్నది.
కాగా నొప్పి ఎట్లా ఉన్నా సరే ఈ చిన్న చిట్కా చేసి చూడండి.
మీకు క్షణాలలో ఉపశమనం కలగటం ఖాయం.
రెండుమూడు వెల్లుల్లిపాయలను తీసుకొని దానికి తగినంత ఉప్పు కలిపి దంచిన మిశ్రమాన్ని నొప్పితో బాధ కలిగించే పన్ను మీద పేస్టులాగా పెట్టండి.
నోరు మూసుకుంటే మీకు బాగా నోట్లో ఉమ్మి ఊరుతుంది.
ఆ ఉమ్మిని ఉమ్మి వేయండి.
పొరపాటున మింగిన ఏమి ఇబ్బంది లేదు.
నొప్పి తగ్గిన తరువాత నోరు నీటితో పుక్కిలిచ్చి వేయండి.
ఈ రకంగా మీరు పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
మిత్రులారా ఈ చిట్కా మీలో ఎవరైనా ఆచరిస్తే ఆ వివరాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.
మరిన్ని చిట్కాలతో రేపు కలుద్దాం
మీ
చేరువేల భాగవశర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి