11, సెప్టెంబర్ 2023, సోమవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 35*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 35*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 ఆ వింత వ్యక్తి నైజాన్నీ, శక్తినీ ఎలాగైనా పరిశోధించి నిజం కనుగొని తీరాలని మూడవసారి నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు... 


రెండవసారి జరిగినట్లు ఈసారి జరుగకూడదనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. కాని కించిత్తు కూడా ఎదురు చూడనిది జరిగింది!ఆ రోజు దక్షిణేశ్వరంలో బాగా రద్దీగా ఉన్నందువల్లనో ఏమో శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి సమీపంలోని యదుమల్లిక్ ఉద్యానానికి తోడ్కొని వెళ్లారు.


ఆ ఉద్యానంలో కాసేపు నరేంద్రునితో పచార్లుచేస్తూ అనేక విషయాలు శ్రీరామకృష్ణులు ముచ్చటించారు. పిదప ఆ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే భావపారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త దూరం నుండే ఇదంతా నరేంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడు, ఆ పారవశ్య స్థితిలోనే హఠాత్తుగా వచ్చి నరేంద్రుణ్ణి ఆయన స్పృశించారు. 


నరేంద్రుడు ఎంతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆ శక్తిమంతమైన స్పర్శచే స్మృతి కోల్పోయాడు. మునుపటి అనుభవాల మాదిరి కాకుండా ఈసారి అతడు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయాడు. కాసేపటి తరువాత అతడికి బాహ్యస్మృతి కలిగినప్పుడు, శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తూ అతడి ఛాతీని చేత్తో నిమురుతూ కనిపించారు.


ఏం జరిగిందో నరేంద్రునికి అర్థం కాలేదు. బహుశా అతడు అర్థం చేసుకోవలసిన అవసరం లేదని శ్రీరామకృష్ణులు భావించి ఉండవచ్చు. శ్రీరామకృష్ణుల  పావన స్పర్శచే నరేంద్రుని మానసిక స్థితిలో గొప్ప మార్పు వచ్చింది. అప్పటి నుండి శ్రీరామకృష్ణులను అతడు పిచ్చి వానిగా భావించలేదు. అందుకు మారుగా, కామకాంచన పీడితులూ, స్వార్థపరులూ అయిన పిచ్చివారి మధ్య జీవిస్తూ బుద్ధి స్పష్టత గల వారిగా ఆయనను పరిగణించాడు. అయినప్పటికీ జరిగిన సంఘటనలు అతడికి అంతుబట్టలేదు.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: