11, సెప్టెంబర్ 2023, సోమవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 19*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 19*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


        *ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో*

         *హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే  మన్మథ  కలామ్ |*

         *ససద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు*

         *త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందుస్తన యుగామ్ ||*


ఈ శ్లోకంలో మూడు బిందువులను (త్రినేత్రములు) ధ్యానించమన్నారు. పైన ఒకటి, క్రింద రెండు. ఇవి అగ్ని,సూర్య చంద్ర బిందువులు. ఈ బిందువుల త్రికోణమును (ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి) మధ్యలోనున్న మరొక బిందువును (శివ శక్తుల సంగమం) దీనినీ ధ్యానించాలి.


ఓ తల్లీ నీ ముఖారవిందమును జగద్బీజంగా (బిందువుగా) సూర్యచంద్రులు సృష్టి స్వరూపిణివైన నీ స్తనయుగ్మముగా(అమ్మ స్తన్యము బిడ్డకు పోషణ ఇచ్చినట్లుగా సూర్యచంద్రుల వల్ల వర్షము కలిగి, పంటలు పండి ప్రపంచానికి పోషణ లభిస్తుంది) ఈ భౌతిక జగత్తు మొత్తం నీ ప్రకృతిగా తలచి, నీ మన్మధకళను(జీవుడిని భ్రాంతికి గురి చేసే స్వభావం) మంగళ రూపమును ఎవరు ధ్యానిస్తారో వారు ఈ కర్మబద్ధమైన ఈ దృశ్యమాన జగత్తు మొత్తం అమ్మ రూపంగా తెలుసుకొని దానితో సంయోగం వీడి ముక్తుడవుతాడు. 


అమ్మవారి అవయవ వర్ణన లౌకిక దృష్టితో చూడరాదు. అవి శక్తి కేంద్రాలుగా, శక్తిస్వరూపాలుగా భావించి ధ్యానించాలి.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: