రామాయణమ్ 321
...
క్రోధమెంత పాపిష్ఠిది!!
.
ఏమి అనాలి
ఏమి అనకూడదు !
.
ఎవరిని అంటున్నాం ?
ఎందుకు అంటున్నాము!
.
ఏది పలుకుతున్నాం !
ఏది పలుకరాదు!
.
ఎవరు పెద్ద
ఎవరు చిన్న
.
ఏదీ తెలియదు
అది ఒక మత్తు
మనిషిని చిత్తుచిత్తుగా ఓడిస్తుంది
మనిషిలోని మృగాన్ని నిద్ర లేపుతుంది !
.
పాము కుబుసము విడిచినట్లు
కోపము ఎవరు విడిచి వేయగలరో
వాడెపో ! ఘనుడు !
వాడెపో ! ఉత్తముడు !
.
సిగ్గు లేక ఎగ్గులేక
ఆలోచించే శక్తిలేక
అమ్మకు కీడు చేశానే !
.
నా తెలివిమాలిన పనికి
ప్రభు కార్యము నాశనమయ్యెగదా!
.
నా సముద్రలంఘనము వ్యర్ధము
నా ప్రయత్నములన్నీ వ్యర్ధము
.
నా కోపము
నా ఆవేశము
అసలుకే ఎసరు పెట్టినవి
.
సీతమ్మ నిస్సంశయముగా కాలిపోయి ఉంటుంది.
.
సీతమ్మ మరణిస్తే?
.
రామడుండడు
రామానుజుడుండు
రామసఖుడుండు
రామబంధువెవ్వడూ ఉండడు
.
ఇక నా బ్రతుకెందుకు?
.
అగ్నికి ఆహుతి అయిపోవుదునా
బడబాగ్నిలో దూకివేయుదునా ..
.
అయినా !
.
నా తోకనే కాల్చని అగ్ని
పరమ పావని సీతమ్మను అంటునా ?
.
అగ్నిని అగ్ని కాల్చివేయగలదా !!!
.
నేను ఇంత జలధి లంఘించి
ఇంత కార్యము చేసితినన్న
అమ్మ మహిమగాక
అన్యమేదియు లేదు
.
అమ్మ క్షేమము !
అమ్మక్షేమము!
అమ్మక్షేమము!
.
అని ఆలోచించి వడిగా వడివడిగా సుడిగాలి వలె అశోకవనమునకు చేరుకొనెను రామదూత హనుమంతుడు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి